Begin typing your search above and press return to search.

మండే ఎండ‌లో స‌న్నీ ఏంటి వాళ్ల‌తో అలా ఏం చేస్తోంది?

By:  Tupaki Desk   |   30 May 2021 12:30 AM GMT
మండే ఎండ‌లో స‌న్నీ ఏంటి వాళ్ల‌తో అలా ఏం చేస్తోంది?
X
అస‌లే ఎండా కాలం.. ఆపై ద‌క్షిణాది రాష్ట్రాల్లో ఎండ‌లు మెండు! కానీ ఆ ఎండ‌ను సైతం లెక్క చేయ‌క ఆరుబ‌య‌ట బీచ్ లో స‌న్నీలియోన్ ఇలా చేస్తోందేమిటి? స‌న్నీ ఏంటి వాళ్ల‌తో అలా ఏం చేస్తోంది? అనే సందేహాలు క‌లుగుతున్నాయా? అయితే వివ‌రాల్లోకి వెళ్లాల్సిందే.

స‌న్నీలియోన్ మొద‌టి లాక్ డౌన్ స‌మ‌యంలో అమెరికాలో సెటిల్ అయిన సంగ‌తి తెలిసిందే. ఆ త‌ర్వాత భ‌ర్త పిల్ల‌ల‌తో పాటు ముంబైలో అడుగు పెట్టాక ఈ భామ ఎడా పెడా ప్రాజెక్టుల‌కు క‌మిటైంది. అందులో ఓ భారీ సినిమా.. ఒక పాపుల‌ర్ టెలివిజ‌న్ షో కూడా ఉంది. తాజాగా స‌న్నీ ఇన్ స్టాలో షేర్ చేసిన ఫోటోలు వీడియోలు ప‌రిశీలిస్తే... ఈ భామ‌ ప్రస్తుతం కేరళలో నటుడు రణ్విజయ్ సింఘ్ తో పాటు టెలివిజన్ రియాలిటీ షో MTV స్ప్లిట్స్ విల్లా సీజన్ 13 ను నిర్వహిస్తోంది. తీవ్రమైన ఎండాకాలంలోనూ 40 ఏళ్ల వయస్సులో ఎంతో చిలిపిగా ఆన్ లొకేష‌న్ స‌న్నీ బోలెడంత సంద‌డి చేసేస్తోంది.

అక్క‌డ రెడ్ హాట్ బికినీల స‌న్నీ బీచ్ ఇసుక లో కూర్చుని ఉంది త‌న‌ చుట్టూ పోటీదారులు ఉన్నారు.. ఆ సమయంలో ఈ ఫోటోని క్లిక్ మ‌నిపించారు. పోటీలో పాల్గొనేవారు మీడియం ఎత్తు పోడియంలో నిలబడి కనిపిస్తున్నారు. బ్యాక్ క్యాప్ - ప్యాంటు ధరించి షర్ట్ లెస్ గా వీరంతా క‌నిపిస్తున్నారు. కెమెరా కోసం ఒక భంగిమను ఇలా ఫోజిచ్చారు స‌న్నీ.

నేను ప్రమాణం చేస్తున్నాను.. నేను పని చేస్తున్నాను! అన్న వ్యాఖ్య‌ను స‌న్నీ జోడించారు. ఆన్ లొకేష‌న్ స‌న్నీ అరుదైన‌ సరదా క్షణాలను ఇలా ఫోటో రూపంలో షేర్ చేసుకుంటోంది. మధ్యాహ్నం 2 గంటల స‌మ‌యంలో భోజనం చేసేందుకు వ‌చ్చిన స‌న్నీ ని ప‌ట్టించుకోని సిబ్బంది నిర్లక్ష్యంకి సంబంధించిన ఫ‌న్నీ వీడియోను ఇన్ స్టాలో షేర్ చేయ‌గా ఆక‌ట్టుకుంది.

సన్నీ లియోన్ కేరళలో చాలా నెలలుగా షూటింగ్ లో పాల్గొంటోంది. లాక్ డౌన్ ప్రకటించ‌డంతో ఏప్రిల్ లో ముంబైకి తిరిగి వ‌చ్చేసిందిట‌. తిరిగి సెట్స్ లోకి జాయిన్ కావాల్సి ఉంటుంది. హిందీ- తమిళం- తెలుగు- మలయాళ భాషల్లో విడుదల కానున్న `షెరో`లోనూ స‌న్నీ క‌నిపంచ‌నుంది. సైకలాజికల్ థ్రిల్లర్ చిత్రానికి శ్రీజిత్ విజయన్ దర్శకత్వం వహిస్తున్నారు. అనామిక అనే వెబ్ సిరీస్ లోనూ స‌న్ని న‌టిస్తోంది. విక్రమ్ భట్ దర్శకత్వం వహిస్తున్నారు.