Begin typing your search above and press return to search.

ఫోటో స్టొరీ: సామ్ స్టైల్ అన్ బీటబుల్

By:  Tupaki Desk   |   20 Feb 2019 11:32 AM GMT
ఫోటో స్టొరీ: సామ్ స్టైల్ అన్ బీటబుల్
X
స్టార్ హీరోయిన్ సమంతాకు మిగతా హీరోయిన్లకు ఒక తేడా ఉంది. ఇతర హీరోయిన్లు హాట్ షో చేస్తే తేడాగా అనిపిస్తుంది కానీ ఎందుకో సమంతా ఘాటుగా కనిపిస్తే మాత్రం ఎబ్బెట్టుగా ఉండదు. అందం.. ఫిట్నెస్.. నటన.. స్టైలు అన్నీ కలగలిసినట్టు ఉన్న హీరోయినే సమంతా. రామలక్ష్మిగా మట్టి పిసుక్కుంటూ మేకప్ లేకుండా కనిపించినా సెట్ అవుతుంది.. 'ఫ్యాషన్' సినిమాలో కంగనా రనౌత్ లాగా అల్ట్రా స్టైలిష్ గెటప్ లో కనిపించినా అంతే న్యాచురల్ గా ఉంది.

ఇలా ఏ గెటప్ కు తగ్గట్టు అలా మారడం సమంతా స్పెషల్. తాజాగా తన ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా ఒక ఫోటో పోస్ట్ చేసింది. ఆ స్టైల్.. ఆ యాటిట్యూడ్ అంతా ఒక ప్రొఫెషనల్ మోడల్ లాగా ఉందంటే నమ్మండి. గుచి బ్రాండ్ బెల్ట్.. గ్రే కలర్ ఫుల్ స్లీవ్స్ టీ-షర్ట్.. సెక్విన్ ఫ్యాబ్రిక్ ఉండే హౌస్ అఫ్ సిబీ ప్యాంట్స్.. హెచ్ఎం బ్రాండ్ వారి ఇయర్ రింగ్స్ తో దర్శనమిచ్చింది. దువ్వనట్టుగా రింగులుగా ఉన్న హెయిర్ స్టైల్.. లిప్ స్టిక్ అసలు వేసుకోకుండా ఒక సోఫా పై కూర్చుని కిరాక్ పోజిచ్చింది.

ఈ ఫోటోకు సమంతా ఇచ్చిన క్యాప్షన్ "#సూపర్ డీలక్స్ #మజిలి #ఓబేబీ..2019 ఫస్ట్ హాఫ్ ఫన్ గా అనిపిస్తోందే." క్యాప్షన్ లో ఉండే సినిమాలు తెలుసు కదా. అందరికీ సూపర్ గా తెలిసింది.. హబ్బీ చైతన్యతో చేసే 'మజిలి. మరి సూపర్ గా తెలియంది మాత్రం 'సూపర్ డీలక్స్'. శివ కార్తికేయన్ హీరోగా నటిస్తున్న తమిళ సినిమా ఇది. ఇక నందిని రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కే కొరియన్ మూవీ రీమేక్ 'ఓ బేబీ'. సరే ఎలాగూ కొరియా ప్రస్తావన వచ్చింది కాబట్టి గుడ్ బై అని కొరియన్ భాషలోనే చెప్పుకుందాం.. అన్ న్యూంగ్ హీ గసియో!!