Begin typing your search above and press return to search.

త‌ల‌పాగ చుట్టి ఈటెతో వేటాడే `నార‌ప్ప‌` క‌థేమి?

By:  Tupaki Desk   |   28 Dec 2020 10:30 AM IST
త‌ల‌పాగ చుట్టి ఈటెతో వేటాడే `నార‌ప్ప‌` క‌థేమి?
X
రొటీన్ క‌థ‌ల్లో న‌టించేందుకు మ‌న హీరోలు ఇప్పుడు సిద్ధంగా లేరు. ఇరుగు పొరుగు భాష‌ల సినిమాల్ని చూసి చాలా నేర్చేసుకుంటున్నారు. ఇక ఈ విష‌యంలో ఒక మెట్టు పైనే ఉంటాడు విక్ట‌రీ వెంక‌టేష్. పొరుగున ప్ర‌యోగాత్మ‌క క‌థ‌ల్ని తెలుగు ఆడియెన్ లో వ‌ర్క‌వుట్ అయ్యేవాటిని అన్న‌య్య సురేష్ బాబు (నిర్మాత‌) తెలివిగా వెతికి ప‌ట్టుకుంటే.. వాటిలో న‌టిస్తూ బ్లాక్ బ‌స్ట‌ర్లు కొట్టేందుకు వెంకీ ప్రిపేర‌వుతుంటాడు.

గ‌తంలో ఎన్నో రీమేక్ లు వెంకీ-సురేష్ బాబు- నాయుడు బృందం తెలుగు ఆడియెన్ కి అందించారు. ఇప్పుడు నార‌ప్ప ఈ కేట‌గిరీనే. త‌మిళంలో ధ‌నుష్ నటించిన బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీ `అసుర‌న్` కి రీమేక్ ఇది. మూల క‌థ‌ను తీసుకుని తెలుగు ఆడియెన్ కి త‌గ్గ‌ట్టు ఈ చిత్రాన్ని ప్రెజెంట్ చేసేందుకు శ్రీ‌కాంత్ అడ్డాల చాలా గ్రౌండ్ వ‌ర్క్ చేశారు. నార‌ప్ప‌ను ప‌క‌డ్భందీగా క్లాస్ మాస్ అనే తేడా లేకుండా అన్ని వ‌ర్గాలు మెచ్చేలా తీర్చిదిద్దుతున్నార‌ని తెలుస్తోంది. 90శాతం చిత్రీక‌ర‌ణ పూర్త‌యింది. 10 శాతం పెండింగ్. ప్ర‌స్తుతం క్లైమాక్స్ తెర‌కెక్కుతోంది.

ఇక క్లైమాక్స్ లో రిస్కీ స్టంట్స్ తో వెంకీ అద‌ర‌గొట్టేస్తున్నార‌ని తెలుస్తోంది. అన్న‌ట్టు త‌ల‌పాగ చుట్టి ఈటెతో వేటాడే వానిగా వెంకీని స‌రికొత్త మాస్ అవ‌తారంలో చూసే స‌ద్భాగ్యం చాలా కాలానికి క‌లుగుతోంది. జ‌యం మ‌న‌దేరా రేంజు ఎమోష‌న్స్ కి ఈ క‌థ‌లో ఆస్కారం ఉంటుంది. ఇప్ప‌టికే రిలీజైన పోస్ట‌ర్లు టీజ‌ర్ లో వెంకీ లుక్ కి చ‌క్క‌ని స్పంద‌న వ‌చ్చింది. మునుముందు ట్రైల‌ర్ తో స్పెష‌ల్ ట్రీటిస్తారేమో వేచి చూడాలి. ఈ చిత్రాన్ని శ్రీకాంత్‌ అడ్డాల దర్శకత్వంలో సురేష్‌ ప్రొడక్షన్స్ - వి క్రియేషన్స్‌ పతాకాలపై డి.సురేష్ బాబు- కలైపులి ఎస్‌. థాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సామ్‌.కె నాయుడు సినిమాటోగ్ర‌ఫీ.. మణిశర్మ సంగీతం అస్సెట్ కానున్నాయి. మలయాళ నటి రెబ్బ మోనిక జాన్ ఇందులో వెంకీ స‌ర‌స‌న నాయిక‌గా న‌టిస్తుండ‌గా ప్రియ‌మ‌ణి ఒక నాయిక‌గా న‌టిస్తోంది.