Begin typing your search above and press return to search.

వివాదంతో నానా పటేకర్ కన్ఫెషన్ ఏంటి?

By:  Tupaki Desk   |   9 April 2022 5:30 AM GMT
వివాదంతో నానా పటేకర్ కన్ఫెషన్ ఏంటి?
X
ప్రముఖ నటుడు నానా పటేకర్ పేరు #MeeToo ఉద్య‌మంలో ప్ర‌ముఖంగా వినిపించింది. అందాల క‌థానాయిక త‌నూశ్రీ ద‌త్తా అత‌డిపై సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసింది. అత‌డు త‌న‌ని తీవ్రంగా వేధించాడ‌ని లైంగిక వేధింపుల‌కు పాల్ప‌డ్డాడ‌ని కూడా త‌నూశ్రీ ఆరోపించ‌డం సంచ‌ల‌నమైంది. అయితే అత‌డి అగ్రెస్సివ్ నేచుర్ ని అర్థం చేసుకోకుండా ఆరోప‌ణ‌లు చేసింద‌ని కూడా అత‌డి అనుయాయులు త‌న‌కు అండ‌గా నిలిచారు.

నిజానికి నానా ప‌టేక‌ర్ జాతీయ ఉత్త‌మ న‌టుడు. అసాధార‌ణ ప్ర‌తిభతో ఓ వెలుగు వెలిగిన సీనియ‌ర్ న‌టుడు. కొన్ని సంవత్సరాలుగా గణనీయమైన అభిమానులను సంపాదించుకున్నాడు. వైవిధ్యభరితమైన పాత్రలలో రాణించగలిగిన నటుడిగా అత‌డిపై ప్ర‌పంచ‌వ్యాప్తంగా అభిమానం ఉంది. అయితే మీటూ వివాదం ద‌రిమిలా అత‌డు కొన్నేళ్లుగా బాలీవుడ్ నుంచి తప్పుకున్నాడు.

అయితే తాజాగా నానా పటేకర్ 'ది కన్ఫెషన్' అనే ఆసక్తికరమైన ప్రాజెక్ట్ తో ఘనమైన పునరాగమనం చేయనున్నాడని తెలుస్తోంది. ఈ చిత్రానికి సంబంధించిన మోషన్ పిక్చర్ కూడా విడుదలైంది. ఇది సత్యం తాలూకా ఆలోచన గురించి నానా పటేకర్ సెటైరిక‌ల్ సంభాషణతో ఆస‌క్తిని క‌లిగిస్తోంది. 22 సెకన్ల నిడివి గల వీడియో చివరలో నానా పటేకర్ కూర్చొని తీవ్ర‌మైన స్ఫుర‌ద్రూపాన్ని చూపించారు. మేకర్స్ ఈ చిత్రం గురించి పెద్దగా వివ‌రాలు వెల్లడించలేదు. కానీ సినిమా టైటిల్ .. నానా పటేకర్ వ‌ల్ల ఆస‌క్తి పెరుగుతోంది. మూవీ కథాంశం గురించి చాలా క్యూరియాసిటీని రేకెత్తించేలా పోస్ట‌ర్ ఉంది.

NH స్టూడియోస్- టైమ్ ఫిల్మ్స్- అజయ్ కపూర్ ప్రొడక్షన్స్ - స్పార్క్లింగ్ స్టూడియోస్ సంస్థ‌లు సంయుక్తంగా 'ది కన్ఫెషన్' చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఈ చిత్రానికి నటుడు-చిత్రనిర్మాత అనంత్ నారాయణ్ మహదేవన్ దర్శకత్వం వహిస్తున్నారు. దీనిని సుభాష్ కాలే- అజయ్ కపూర్- ప్రవీణ్ షా -నరేంద్ర హిరావత్ నిర్మిస్తున్నారు.

ఈ చిత్రానికి ప్రముఖ నవలా రచయిత.. స్క్రీన్ రైటర్ అయిన సి పి సురేంద్రన్ స్క్రిప్టును అందించారు. ప్రవీణ్ షా- ఇతరులు నరేంద్ర హిరావత్ మరియు ఇతర నిర్మాతలతో కలిసి తమ త‌దుప‌రి భారీ ప్రాజెక్ట్ ల గురించి ప్రకటించారు. ఈ కార్యక్రమానికి పలువురు సెలబ్రిటీలు హాజరయ్యారు. టైమ్ ఫిల్మ్స్ లైనప్ లో భాగమైన చిత్రాలలో కన్ఫెషన్ ఒకటి. ఈ కార్యక్రమంలో నానా పటేకర్- అనంత్ నారాయణ్ మహదేవన్- సుభాష్ కాలే- ప్రవీణ్ షా- అజయ్ కపూర్ తదితరులు కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు.

నాలుగేళ్ల తర్వాత నానా పటేకర్ చేస్తున్న తొలి ప్రాజెక్ట్ ఇదే. అతను చివరిగా రజనీకాంత్ నటించిన కాలా (2018)లో ప్రతినాయకుడిగా కనిపించాడు. అతను హౌస్ ఫుల్ 4 (2019)లో బ్యాడ్డీ పాత్రలో న‌టించారు. దాని కోసం షూటింగ్ కూడా ప్రారంభించాడు. అయితే తనుశ్రీ దత్తా చేసిన #MeToo వేవ్ సమయంలో అతనిపై ఆరోపణలు రావడంతో అతను తప్పుకోవాల్సి వచ్చింది. ఈ పరిణామాల తర్వాత సినిమాలకు దూరంగా ఉన్నాడు. 2021 చివరలో అతను టాటా స్కై ప్రకటన ప్రచారంలో కనిపించాడు. లెజెండ‌రీ నటుడు నానా తిరిగి న‌టిస్తున్నారు అన‌గానే అభిమానుల్లో ఉత్సాహం నెల‌కొంది.