Begin typing your search above and press return to search.

'లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌' విడుదల పరిస్థితి ఏంటీ?

By:  Tupaki Desk   |   27 Feb 2019 6:05 AM GMT
లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ విడుదల పరిస్థితి ఏంటీ?
X
బాలకృష్ణ, క్రిష్‌ ల కాంబినేషన్‌ లో తెరకెక్కిన ఎన్టీఆర్‌ బయోపిక్‌ రెండు పార్ట్‌ లు వచ్చేశాయి. ఆ సినిమా ఫలితాలు అందరికి షాక్‌ ఇచ్చాయి. ఎన్టీఆర్‌ బయోపిక్‌ కు తెలుగు ప్రేక్షకుల్లో విపరీతమైన క్రేజ్‌ ఉన్నా కూడా ఆ సినిమాలు ఎందుకు వసూళ్లు సాధించలేక పోయాయి అనే విషయం ఇప్పుడు ఎవరు సమాధానం చెప్పలేని ప్రశ్నగా మిగిలింది. ఈ సమయంలోనే వర్మ దర్శకత్వంలో రూపొందుతున్న ఎన్టీఆర్‌ మరో బయోపిక్‌ 'లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌' కోసం జనాలు ఎదురు చూస్తున్నారు.

ఇప్పటికే విడుదలైన పాటలు మరియు ట్రైలర్‌ లు సినిమాపై అంచనాలు పెంచాయి. బాలయ్య చేసిన బయోపిక్‌ కు ప్రేక్షకుల ఆధరణ కరువైన నేపథ్యంలో వర్మ తీసిన బయోపిక్‌ ను ఎలా ప్రేక్షకులు రిసీవ్‌ చేసుకుంటారా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ట్రైలర్‌ విడుదల సమయంలో హడావుడి చేసిన వర్మ ఇప్పుడు ఆ సందడి కనిపించడం లేదు. వర్మ మూవీ విడుదల తేదీ విషయంలో ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు.

వర్మ నుండి ఎలాంటి అధికారిక ప్రకటన రానప్పటికి ఆయన సన్నిహితుల నుండి అందుతున్న సమాచారం ప్రకారం సినిమాను మార్చి 15వ తేదీన విడుదల చేయాలని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే షూటింగ్‌ పూర్తి చేసుకున్న లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ కు పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. అన్ని అనుకున్నట్లుగా జరిగితే మార్చి 15 లేదంటే ఆ తర్వాత వారంలో లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ విడుదలయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ట్రైలర్‌ తోనే తాను ఏం చూపించబోతున్నాడో చెప్పకనే చెప్పాడు. సినిమాతో మరెంత సంచలనం సృష్టిస్తాడో చూడాలి.