Begin typing your search above and press return to search.

అర‌రే.. 'లైగ‌ర్‌' బ్యూటీని ఎవ‌రూ ప‌ట్టించుకోవ‌డం లేదేంటి?

By:  Tupaki Desk   |   15 July 2022 6:33 AM GMT
అర‌రే.. లైగ‌ర్‌ బ్యూటీని ఎవ‌రూ ప‌ట్టించుకోవ‌డం లేదేంటి?
X
అనన్య పాండే.. బాలీవుడ్ లో ఈ యంగ్ బ్యూటీకి ఉన్న పాపులారిటీ అంతా ఇంతా కాదు. సినీ నటుడు చుంకీ పాండే ముద్దుల కుమార్తె అయిన అన‌న్య పాండే.. 'స్టూడెంట్‌ ఆఫ్‌ ది ఇయర్‌–2' మూవీతో గ్రాండ్ గా సినీ ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టి అతి త‌క్కువ స‌మ‌యంలోనే కావాల్సినంత క్రేజ్ సంపాదించుకుంది. ఓవైపు ఆక‌ట్టుకునే న‌ట‌న‌, మ‌రోవైపు మైమ‌ర‌పించే గ్లామ‌ర్ షోతో ప్రేక్ష‌కుల‌కు ఫుల్ మీల్స్ పెట్టేస్తున్న‌ ఈ నార్త్ సోయ‌గం త్వ‌ర‌లోనే టాలీవుడ్ లోకి అడుగు పెట్ట‌బోతోంది.

డైన‌మిక్ డైరెక్ట‌ర్ పూరీ జ‌గ‌న్నాథ్‌, టాలీవుడ్ రౌడీ బాయ్ విజ‌య్ దేవ‌ర‌కొండ కాంబినేష‌న్ లో రూపుదిద్దుకున్న చిత్రం 'లైగ‌ర్‌'. ధర్మా ప్రొడెక్షన్స్‌, పూరీ కనెక్ట్స్ బ్యాన‌ర్ల‌పై కరణ్ జోహార్, ఛార్మీ కౌర్, అపూర్వ మెహతా, హిరూ యష్ జోహార్ మ‌రియు పూరీ జ‌గ‌న్నాథ్ లు కలిసి ఈ మూవీని నిర్మించారు. బాక్సింగ్ బ్యాక్ డ్రాప్ లో తెర‌కెక్కిన పాన్ ఇండియా చిత్ర‌మిది.

ఇందులో విజ‌య్ దేవ‌ర‌కొండ‌కు జోడీగా అన‌న్య పాండే న‌టించింది. ర‌మ్య‌కృష్ణ‌, రోనిత్ రాయ్, మకరంద్ దేశ్ పాండే, బాక్సింగ్ దిగ్గజం మైక్ టైసన్ కీల‌క పాత్ర‌ల్లో అల‌రించ‌బోతున్నారు. ఇప్ప‌టికే షూటింగ్ కంప్లీట్ చేసుకుని పోస్ట్ ప్రొడెక్ష‌న్ ప‌నుల‌ను జ‌రుపుకుంటున్న ఈ చిత్రం.. ఆగ‌స్టు 25న తెలుగుతో పాటు త‌మిళ్‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ, హిందీ భాష‌ల్లో అట్టహాసంగా విడుద‌ల కాబోతోంది.

ఈ నేప‌థ్యంలోనే మేక‌ర్స్ వ‌రుస అప్డేట్స్ ను బ‌య‌ట‌కు వ‌దులుతూ.. సినిమాపై మంచి బ‌జ్ క్రియేట్ చేస్తున్నారు. అయితే లైగ‌ర్ అన‌గానే అంద‌రి దృష్టి విజ‌య్ దేవ‌ర‌కొండ మీద‌కే వెళ్తోంది. కానీ, అన‌న్య పాండేను మాత్రం ఎవ‌రూ ప‌ట్టించుకోవ‌డం లేదు. 'లైగ‌ర్‌'పై అన‌న్య ఎన్నో ఆశ‌లు పెట్టుకుంది. కేవ‌లం నార్త్ కే ప‌రిమితం కాకుండా.. 'లైగ‌ర్‌' ద్వారా వ‌చ్చిన క్రేజ్ తో సౌత్ లోనూ స‌త్తా చాటాల‌ని, ఇక్క‌డి స్ట‌ర్ హీరోల‌తో క‌లిసి న‌టించాల‌ని ముచ్చ‌ట‌ప‌డింది.

కానీ, ఇప్పుడు 'లైగ‌ర్‌' ద్వారా అన‌న్య‌కు పెద్ద‌గా ఒరిగేదేమి ఉండ‌ద‌ని ప‌లువురు సినీ విశ్లేష‌కులు భావిస్తున్నారు. అందుకు కార‌ణం.. ఆమెను ఇక్క‌డ ఎవ‌రూ పెద్ద‌గా గుర్తించ‌క‌పోవ‌డ‌మే అని అంటున్నారు. మేక‌ర్స్ కూడా విజ‌య్ నే టార్గెట్ చేసుకుని 'లైగ‌ర్‌'ను ప్ర‌మోట్ చేస్తున్నారు త‌ప్పా.. అన‌న్య వైపు చూడ‌టం లేదు. దాంతో ఇక్క‌డ ఆమెకు ఎలాంటి క్రేజు ఏర్ప‌డ‌టం లేదు.

ఏదేమైనా సినిమాలో అన‌న్య పాత్ర‌కు మంచి ప్రాధాన్య‌త ఉంటే.. ఖ‌చ్చితంగా ఆమె ఇక్క‌డ నిల‌దొక్కుకునే అవ‌కాశాలు ఉంటాయి. లేదంటే ఆమె సౌత్ పై త‌న ఆశ‌ల‌ను వ‌దులుకోవాల్సిందే.