Begin typing your search above and press return to search.

పెళ్లిపై హ‌న్సిక ట‌క్కున అంత మాట‌నేసిందేంటి?

By:  Tupaki Desk   |   14 July 2022 1:30 AM GMT
పెళ్లిపై హ‌న్సిక ట‌క్కున అంత మాట‌నేసిందేంటి?
X
హ‌న్సిక.. ఈ ముద్దుగుమ్మ గురించి ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. ముంబైలో జ‌న్మించిన ఈ బ్యూటీ చైల్డ్ ఆర్టిస్ట్ గా ప‌లు సినిమాలు, సీరియ‌ల్స్‌, యాడ్స్ లో న‌టించింది. అల్లు అర్జున్ హీరోగా పూరీ జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ 'దేశముదురు'తో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఆ త‌ర్వాత వ‌రుస అవ‌కాశాల‌ను అందిపుచ్చుకున్న హ‌న్సిక‌.. అతి త‌క్కువ స‌మ‌యంలోనే టాలీవుడ్‌, కోలీవుడ్ ఇండ‌స్ట్రీల్లో కావాల్సినంత క్రేజ్ సంపాదించుకుంది.

సుదీర్ఘ కాలం నుండి సినీ ఇండ‌స్ట్రీలో కొన‌సాగుతున్న హన్సిక‌.. త్వ‌ర‌లోనే 'మహా' మూవీతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించ‌బోతోంది. ఇది హ‌న్సిక కెరీర్ లో తెర‌కెక్కిన 50వ చిత్రం. జమీల్‌ దర్శకత్వం వ‌హించిన ఈ చిత్రంలో శింబు ప్ర‌ధాన పాత్ర‌ను పోషించాడు. ఇదో లేడీ ఓరియెంటెడ్ మూవీ కాగా.. దీనిని ఎక్స్‌ట్రా ఎంటర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్ పై మదియళగన్‌ నిర్మించారు.

ఎప్పుడో షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం.. మ‌రి కొద్ది రోజుల్లో గ్రాండ్ గా విడుద‌ల కాబోతోంది. ఈ నేప‌థ్యంలోనే హ‌న్సిక తాజాగా మీడియాతో ముచ్చటించింది. ఈ సంద‌ర్భంగా ఆమె వృత్తిపరమైన విషయాలే కాకుండా వ్యక్తిగత విషయాలను సైతం షేర్ చేసుకుంది. 'మ‌హా' సినిమాలో ఒక బిడ్డకు తల్లిగా నటించాన‌ని, ఎన్నో కష్టాలను ఎదుర్కొనే పాత్ర అని, నటనకు అవకాశం తో పాటు అన్ని రకాల ఎమోషన్స్ త‌న పాత్రలో ఉంటాయ‌ని హ‌న్సిక చెప్పుకొచ్చింది.

అలాగే సినిమా ఆల‌స్యం కావ‌డానికి ఎన్నో కార‌ణాలు ఉన్నాయి.. కోవిడ్ కూడా ఒక కార‌ణమంటూ హ‌న్సిక పేర్కొంది. ఇక ఈ క్ర‌మంలోనే 'హాఫ్ సెంచరీ సినిమాలు దాటేశారు. పెళ్లెప్పుడు చేసుకుంటారు?' అనే ప్ర‌శ్న‌కు హ‌న్సిక‌కు ఎదురైంది. అయితే అందుకు ఆమె ఇచ్చిన స‌మాధానం ఇప్పుడు నెట్టింట వైర‌ల్ గా మారింది. 'పెళ్లి ఎందుకు చేసుకోవాలి? ప్రస్తుతం నేను సంతోషంగానే ఉన్నాను. ఇప్పటికీ వర్క్‌తోనే నా పెళ్లి. టైం వచ్చినప్పుడు దాని గురించి ఆలోచిస్తాను.' అని ట‌క్కున అనేసింది హ‌న్సిక‌.

హ‌న్సిక మాట‌ల‌కు ఆమె అభిమానులు ఆశ్చ‌ర్య‌పోతున్నారు. అస‌లు హ‌న్సిక‌కు పెళ్లి చేసుకునే ఉద్దేశ‌మే లేదా..? అంద‌కే అలా మాట్లాడిందా..? అంటూ నెట్టింట చ‌ర్చ‌లు కూడా మొద‌లు పెట్టారు. కాగా, గ‌తంలో హ‌న్సిక తమిళ స్టార్ హీరో శింబుతో ప్రేమాయణం న‌డిపించిన సంగ‌తి తెలిసిందే. వీరిద్ద‌రూ పెళ్లి చేసుకుంటార‌ని కూడా వార్త‌లు వ‌చ్చాయి. కానీ, అక్కడి వ‌ర‌కు వెళ్ల‌కుండానే వీరిద్ద‌రూ బ్రేక‌ప్ చెప్పుకున్నారు. ఆ త‌ర్వాత కెరీర్ పైనే దృష్టి సారించిన హ‌న్సిక‌..

హిట్లు, ఫ్లాపుల‌తో సంబంధం లేకుండా వ‌రుస సినిమాలు చేస్తూ దూసుకుపోతోంది. ప్ర‌స్తుతం ఈమె చేతిలో 'మై నేమ్ ఈజ్ శృతి', '105 మినిట్స్'తో స‌హా తెలుగు, త‌మిళ్ భాష‌ల్లో మొత్తం ప‌ది ప్రాజెక్ట్స్ ఉన్నాయ‌ట‌.