Begin typing your search above and press return to search.

రాఖీ భాయ్‌ మైండ్ లో ఏం రన్నవుతోంది?

By:  Tupaki Desk   |   30 Dec 2022 10:30 AM GMT
రాఖీ భాయ్‌ మైండ్ లో ఏం రన్నవుతోంది?
X
క‌న్న‌డ ఇండ‌స్ట్రీ నుంచి 'కేజీఎఫ్' ఫ్రాచైజీల‌తో ఊహించ‌ని విధంగా టాక్ ఆఫ్ ద ఇండియాగా మారిన స్టార్ య‌ష్‌. బ్యాక్ టు బ్యాక్ విడుద‌లైన 'కేజీఎఫ్‌' సిరీస్ ల‌తో య‌ష్ పాన్ ఇండియా స్టార్ ల జాబితాలో చేరిపోయాడు. చాప్ట‌ర్ 1 కు మించి 'కేజీఎఫ్ 2' వ‌ర‌ల్డ్ వైడ్ గా సంచ‌ల‌న విజ‌యాన్ని సొంతం చేసుకోవాడ‌మే కాకుండా ప్ర‌పంచ వ్యాప్తంగా రికార్డు స్థాయి వ‌సూళ్ల‌ని రాబ‌ట్టి ఔరా అనిపించింది. క‌న్న‌డ ఇండ‌స్ట్రీ టాక్ ఆఫ్ ద ఇండియాగా మారేలా చేసింది.

య‌ష్ న‌టించిన 'కేజీఎఫ్ చాప్ట‌ర్ 2' ప్రపంచ వ్యాప్తంగా ఊహించ‌ని విధంగా బాక్సాఫీస్ వ‌ద్ద రూ. 1200 కోట్ల‌కు మించి వ‌సూళ్ల‌ని రాబ‌ట్టి చ‌రిత్ర సృష్టించింది. దీంతో ఈ మూవీ త‌రువాత హీరో య‌ష్ నుంచి ఎలాంటి సినిమా రాబోతోంది? .. ఏ ద‌ర్శ‌కుడితో య‌ష్ త‌న త‌దుప‌రి మూవీని ప్ర‌క‌టించ‌బోతున్నాడు? అనే చ‌ర్చ దేశ వ్యాప్తంగా జ‌రుగుతోంది. ఇంత చ‌ర్చ జ‌రుగుతున్నా, త‌న త‌దుప‌రి ప్రాజెక్ట్ కోసం ప్రేక్ష‌కులు ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నా య‌ష్ మాత్రం 'కేజీఎఫ్ 2' రిలీజ్ త‌రువాత కూల్ గా త‌న ఫ్యామిలీతో వెకేష‌న్ ల‌కు వెళుతూ ఎంజాయ్ చేస్తున్నాడు.

త‌దుప‌రి ప్రాజెక్ట్ విష‌యంలో ఎక్క‌డా తొంద‌ర ప‌డ‌కుండా కామ్ గా వుంటూ త‌న ప‌ని తాను చేసుకుపోతున్నాడు. భారీ పాన్ ఇండియా బ్లాక్ బ‌స్ట‌ర్ త‌రువాత ఏ హీరో అయినా ఆ హిట్ ని క్యాష్ చేసుకోవాల‌ని బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్ ల‌ని లైన్ లో పెడ‌తాడు. కానీ య‌ష్‌ మాత్రం అందుకు పూర్తి భిన్నంగా ఆలోచిస్తూ అడుగులు వేస్తున్నాడ‌ని తెలుస్తోంది.

య‌ష్ త‌న త‌దుప‌రి ప్రాజెక్ట్ ని ఎవ‌రితో చేయ‌బోతున్నాడ‌ని చ‌ర్చ జ‌రుగుతున్న వేళ త‌ను మాత్రం క‌న్న‌డ డైరెక్ట‌ర్ల‌తో చ‌ర్చ‌లు జ‌రుపుతున్నాడ‌ట‌.

జ‌న‌వ‌రి 8న య‌ష్ పుట్టిన రోజు నేప‌థ్యంలో కొత్త ప్రాజెక్ట్ కు సంబంధించిన ప్ర‌క‌ట‌న రాబోతోంది. అయితే దీనికి సంబంధించి ప‌లువురు డైరెక్ట‌ర్ల‌తో చ‌ర్చ‌లు జ‌రుపుతున్న య‌ష్ మైండ్ లో మాత్రం స‌రికొత్త ఆలోచ‌న ర‌న్న‌వుతోంద‌ని చెబుతున్నారు. 'కేజీఎఫ్‌' సిరీస్ ల‌తో క‌న్న‌డ ఇండ‌స్ట్రీ గురించి యావ‌త్ ప్ర‌పంచం మాట్లాడుకుంటూ ఒక్క‌సారిగా అటు వైపు చూసేలా చేసిన య‌ష్ త‌న త‌దుప‌రి మూవీతో క‌న్న‌డ ఇండ‌స్ట్రీకి మ‌రింత ఎలివేష‌న్ ఇవ్వాల‌ని, దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మార్చాల‌నే ఆలోచ‌న‌లో వున్నాడ‌ట‌.

త‌ను ఓకే అంటే టాప్ డైరెక్ట‌ర్ లు క్యూ క‌ట్టేస్తారు. కానీ అలా కాకుండా ప‌వ‌ర్ ఫుల్ స్టోరీకి మాత్ర‌మే త‌ను తొలి ప్రాధాన్య‌త ఇవ్వాల‌ని, ఆ త‌రువాతే ద‌ర్శ‌కుడి గురించి ఆలోచించాల‌ని భావిస్తున్నాడ‌ట‌. ఈ నేఫ‌థ్యంలో ప‌లువురు బాలీవుడ్, టాలీవుడ్‌ డైరెక్ట‌ర్ల‌తోనూ చ‌ర్చ‌లు జ‌రుపుతున్న యష్ ఫైన‌ల్ గా క‌న్న‌డ ఇండ‌స్ట్రీ మ‌రింత‌గా పాపుల‌ర్ అయ్యేలా చేసే డైరెక్ట‌ర్ తో సినిమా చేయాల‌ని భావిస్తున్నాడ‌ట‌. ఈ విష‌యంలో పూర్తి స్ప‌ష్ట‌త‌తో వున్న య‌ష్ త‌న త‌దుప‌రి ప్రాజెక్ట్ ని త‌న పుట్టిన రోజైన జ‌న‌వ‌రి 8న ప్ర‌క‌టించే అవ‌కాశం వుంద‌ని తెలుస్తోంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.