Begin typing your search above and press return to search.

యంగ్‌ హీరో.. మెగాస్టార్‌ మనవరాలు మద్య ఏం జరుగుతోంది?

By:  Tupaki Desk   |   22 April 2022 3:30 PM GMT
యంగ్‌ హీరో.. మెగాస్టార్‌ మనవరాలు మద్య ఏం జరుగుతోంది?
X
బాలీవుడ్‌ మెగాస్టార్ అమితాబచ్చన్‌ మనవరాలు అయిన నవ్య నవేలీ నంద గత కొంత కాలంగా సోషల్ మీడియాలో ప్రముఖంగా కనిపిస్తుంది. ఆమె ఆయనతో డేటింగ్‌ లో ఉంది.. ఈయనతో చాటింగ్ చేస్తుంది అంటూ మీడియాలో మరియు సోషల్‌ మీడియాలో రకరకాలుగా పుకార్లు షికార్లు చేస్తూనే ఉన్నాయి. ఎప్పటిలాగే వాటికి నవ్య నో కామెంట్స్ అన్నట్లుగా సైలెంట్‌ గా ఉంటుంది. అయితే ఆమె గురించి పుకార్లు పుట్టుకు వస్తూనే ఉన్నాయి.

తాజాగా ఈఅమ్మడు యంగ్‌ హీరో సిద్దాంత్‌ చతుర్వేది తో ప్రేమలో ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. అందుకు గాను ఇదిగో సాక్ష్యం అంటూ చాలా మంది చాలా రకాలుగా ప్రచారాలు చేస్తున్నారు. తాజాగా ఈ అమ్మడు సోషల్‌ మీడియాలో షేర్ చేసిన ఫోటోను మరియు సిద్దాంత్‌ చతుర్వేది షేర్‌ చేసిన ఫోటోను పోల్చి చూస్తే రెండు ఫోటోలు కూడా ఒకే చోట తీసుకున్నవి గా అనిపిస్తున్నాయి అంటూ నెటిజన్లు చర్చించుకుంటున్నారు.

వీరిద్దరూ ప్రస్తుతం వెకేషన్ లో ఉన్నారు.. ఇద్దరు కలిసి హాలీడేస్ ను ఎంజాయ్‌ చేస్తూ డేట్‌ లో ఉన్నారంటూ మీఈడియా వర్గాల్లో కూడా చర్చ జరుగుతోంది. మొత్తానికి వీరిద్దరికి సంబంధించిన ఫోటోలు మరియు వీడియో లు సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతూ ఇద్దరి మద్య ఏదో ఉంది.. ఇద్దరి మద్య ఏదో జరుగుతుంది అన్నట్లుగా పుకార్లు షికార్లు చేయడం మాత్రమే కాకుండా బాలీవుడ్‌ లో కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి.

సిద్దాంత్‌ చతుర్వేది షేర్ చేసిన ఫోటో కు నవ్య నవేలీ మండే సూర్యుడు ఈమోజీని కామెంట్‌ గా పెట్టింది. వెంటనే ఆ కామెంట్ గురించి చర్చ మొదలు అయ్యింది. దాంతో తన కామెంట్‌ ను నవ్య డిలీట్‌ చేసింది. ఆమె డిలీట్‌ చేయడం వెనుక ఉద్దేశ్యం ఏంటీ అంటూ కొందరు కామెంట్స్ చేస్తుంటే మరి కొందరు మాత్రం ఆమె విషయంలో మీడియా అనవసర రాద్దాంతం చేస్తుంది అన్నట్లుగా కామెంట్స్ చేస్తున్నారు.

ఇక యంగ్‌ హీరో సిద్దాంత్‌ చతుర్వేది గురించి చెప్పాలంటే ఇటీవలే ఈయన దీపిక పదుకునే తో కలిసి గెహ్రియాన్ అనే సినిమాను చేశాడు. ఆ సినిమా లో ఈయన దీపిక పదుకునే తో చేసిన రొమాన్స్.. ముద్దు సన్నివేశాలు సూపర్‌ హిట్‌ అయ్యాయి.

అవి యూత్‌ ఆడియన్స్ లో ముఖ్యంగా అమ్మాయిల్లో సిద్దాంత్‌ కు మంచి పేరును తెచ్చి పెట్టాయి అనడంలో సందేహం లేదు. వీరి సోషల్‌ మీడియా ప్రేమ కథ గురించి ఎప్పటికి క్లారిటీ వస్తుందో చూడాలి.