Begin typing your search above and press return to search.

బ్యాచిలర్‌ విడుదల విషయంలో క్లారిటీ ఏది

By:  Tupaki Desk   |   6 Dec 2020 1:30 PM GMT
బ్యాచిలర్‌ విడుదల విషయంలో క్లారిటీ ఏది
X
అఖిల్‌ కెరీర్‌ ఏ ముహూర్తాన మొదలు పెట్టాడో కాని అన్ని ఉన్నా ఏదో అన్నట్లుగా ఆయన ప్రతి సినిమా ఏదో ఒక ఇబ్బంది ఎదుర్కొంటుంది. మొదటి మూడు సినిమాలు నిరాశ పర్చాయి. నాల్గవ సినిమా 'మోస్ట్‌ ఎలిజబుల్‌ బ్యాచిలర్' బొమ్మరిల్లు స్థాయిలో ఉంటుందని అక్కినేని అభిమానులు వెయిట్‌ చేస్తున్న సమయంలో కరోనా కారణంగా సినిమా ఆలస్యం అవుతుంది.

ఈ ఏడాది ఆరంభంలో అనుకున్న సినిమా కాస్త వచ్చే ఏడాది ఆరంభంలో కూడా వచ్చే అవకాశం కనిపించడం లేదు. బొమ్మరిల్లు భాస్కర్‌ దర్శకత్వంలో అల్లు అరవింద్‌ సమర్పణలో రూపొందుతున్న ఈ సినిమా విడుదల విషయంలో స్పష్టత కరువయ్యింది.

సినిమా షూటింగ్‌ దాదాపుగా ముగిసింది. అఖిల్‌ కు జోడీగా పూజా హెగ్డే నటిస్తున్న ఈ సినిమాపై మొదటి నుండి అంచనాలు భారీగా ఉన్నాయి. కాని సినిమా ఆలస్యం అవుతున్నా కొద్ది సినిమా గురించి జనాలు మాట్లాడుకోవడం మానేశారు అనిపిస్తుంది. సినిమా విడుదల సమయంలో మళ్లీ హడావుడి ఉంటుందా లేదా అనేది చూడాలి.

ఈ సినిమా విడుదల ఎప్పుడు అనే విషయంలో క్లారిటీ లేకపోవడంతో ప్రమోషన్‌ విషయంలో కూడా మేకర్స్‌ ఎక్కువగా అగ్రెసివ్‌ గా ఉండటం లేదు. కరోనా కారణంగా ఈ ఒక్క సినిమానే కాకుండా ఇంకా పలు సినిమాలు విడుదల వాయిదా పడటంతో వాటిని గురించి మాట్లాడుకోవడం మానేశారు. సంక్రాంతికి అంటూ మొన్నటి వరకు అనుకున్నా కూడా ఇప్పుడు మాత్రం సమ్మర్‌ అంటూ వార్తలు వస్తున్నాయి. అసలు విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది.