Begin typing your search above and press return to search.

బాలయ్య నెక్స్ట్ మూవీ ఏంటి..?

By:  Tupaki Desk   |   16 Dec 2020 1:00 PM IST
బాలయ్య నెక్స్ట్ మూవీ ఏంటి..?
X
సింహా, లెజెండ్ వంటి బ్లాక్ బస్టర్ హిట్ల తర్వాత బాలయ్య-బోయపాటి కాంబోలో మూడో చిత్రం వస్తున్న సంగతి తెలిసిందే. ఇంకా పేరు ఖరారు చేయని ఈ సినిమాను అభిమానులు ముద్దుగాా ‘బీబీ3’ అని పిలుచుకుంటున్నారు. అయితే.. ఈ మూవీకి ‘డేంజర్’ అనే టైటిల్ పెట్టనున్నారని సోషల్ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొట్టింది. ఇటీవల మరో టైటిల్ కూడా తెరపైకి వచ్చింది. ఈ చిత్రానికి ‘టార్చ్‌ బేరర్’ అనే టైటిల్‌ ను దర్శకుడు పరిశీలిస్తున్నాడనే టాక్ కూడా వినిపిస్తోంది కృష్ణానగర్ లో. ఇదిలా ఉంటే.. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్‌ కు నందమూరి అభిమానుల నుంచి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. కరోనా లాక్‌ డౌన్ కారణంగా నిలిచి పోయిన ఈ సినిమా షూటింగ్.. ఈ మధ్యనే సెట్స్‌ పైకి వెళ్లిందని టాక్. అయితే.. ఈ సినిమా తర్వాాత బాలయ్య నెక్స్ట్ ప్రాజెక్టు ఏంటనే దానిపై క్లారిటీ రావట్లేదు.

అనిల్ రావిపూడితో..?
బోయపాటి మూవీ కంప్లీట్ అవ్వగానే.. అనిల్ రావిపూడి చిత్రం చేస్తారనే టాక్ నడుస్తోంది. మంచి కామెడీ ఎంటర్‌ టైనర్స్‌‌‌‌తో వరుస విజయాలు అందుకుంటున్న అనిల్.. బాలకృష్ణతో సినిమా చేయాలని ఎప్పటినుండో ఆశ పడుతున్నాడు. వీరిద్దరి కాంబోలో వచ్చే చిత్రానికి ‘రామారావు గారు’ అనే టైటిల్‌ పెట్టబోతున్నారనే టాక్ కూడా నడుస్తోంది. ప్రస్తుతం అనిల్ రావిపూడి ‘ఎఫ్‌ 3’ షూట్ చేస్తున్నాడు. బాలయ్య బీబీ3తో బిజీగా ఉన్నాడు. ఈ రెండు ప్రాజెక్టులు కంప్లీట్ అవ్వగానే.. వీరిద్దరి చిత్రం సెట్స్ పైకి వెళ్తుందని ఇండస్ట్రీ వర్గాల టాక్. అంతేకాదు.. ఈ చిత్రాన్ని స్వయంగా బాల‌కృష్ణ నిర్మించనున్నారని సమాచాారం.

పూరీతో మరోసారి..
గతంలో ‘పైసా వసూల్’ అంటూ.. బాలయ్య, పూరీ చేసిన హంగామా అంతాా ఇంతా కాదు. సక్సెస్ విషయం పక్కన బెడితే.. ఈ సినిమా అభిమానులకు మాంచి కిక్ ఇచ్చింది. ఇప్పుడు ఈ కాంబినేషన్ రిపీట్ కాబోతోందని ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. ‘పైసా వసూల్’తో పూరి-బాలయ్య మధ్య మంచి బాాండింగ్ ఏర్పడింది. బాలయ్యతో లవ్‌లో ఉన్నానంటూ ఆ మధ్య పూరీ సరదా వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. పూరీ ఎప్పుడు సినిమా చేద్దామన్నా రెడీ అంటూ బాలయ్య కూడా చెప్పేశారు. సో.. ఇప్పుడది కాార్యరూపం దాల్చనుంది అంటున్నారు.

నాగశౌర్యతో కలిసి..
పై రెండు చిత్రాల గురించి చర్చ నడుస్తుండగానే.. మరో విషయం తెరపైకి వచ్చింది. ఓ కన్నడ దర్శకుడితో కలిసి బాలయ్య సినిమా చేయనున్నారనేది దాని సారాంశం. అంతేకాదు.. ఇందులో యువ హీరో నాగశౌర్య కూడా నటిస్తున్నాడని ప్రచారం సాగుతోంది. కానీ.. ఇప్పటి వరకైతే క్లారిటీ రాలేదు. అయితే.. బాలయ్య వర్గాలు మాత్రం దీన్ని కొట్టి పారేస్తున్నాయి. ఇదంతా కేవలం పుకారేనని, ఇందులో వాస్తవం లేదని అంటున్నాయి.

ఈ విధంగా.. బాలయ్య కొత్త ప్రాజెక్టులపై ఇండస్ట్రీలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి తప్ప, అధికాారికంగా ఎలాంటి ప్రకటనా వెలువడ లేదు. మరి, బీబీ3 తర్వాత నందమూరి నటసింహం ఏ చిత్రం చేయనున్నారు? ఏ దర్శకుడికి అవకాశం ఇస్తారు? అనే విషయాాలు తెలియాలంటే మరికొన్నాళ్లు ఆగాల్సిందే.