Begin typing your search above and press return to search.

అసలు అర్జున్ సమస్య ఏంటి ?

By:  Tupaki Desk   |   30 May 2019 2:30 PM GMT
అసలు అర్జున్ సమస్య ఏంటి ?
X
ఇప్పటికే పలుమార్లు వాయిదా పడుతూ వచ్చిన అర్జున్ సురవరం రిలీజ్ డేట్ కు సంబంధించి ఇంకా క్లారిటీ రావడం లేదు. పోయిన నెల వచ్చేది కానీ అవెంజర్స్ ఎండ్ గేమ్ కు జడిసి తీసుకున్న వెనకడుగు ఇంకొంచెం సమస్యను పెద్దది చేసింది. దాని తర్వాత మహర్షి మొదలుకుని రేపటి ఎన్జికే ఫలక్ నుమా దాస్ దాకా వరసగా షెడ్యూల్ చేసిన సినిమాలు ఉండటంతో మళ్ళీ సరైన డేట్ దొరకడం సవాల్ గా మారింది.

ఒకవైపు నిఖిల్ ఇది చాలా కష్టపడి చేసిన మూవీ. బాడీ ఫిట్ నెస్ మార్చుకుని కండలు పెంచాడు. నెలల తరబడి కాల్ షీట్స్ అవసరం పడినా లేదనకుండా దీని కోసం చాలా ఒళ్ళు వంచాడు. ఒరిజినల్ ఫ్లేవర్ మిస్ కాకూడదని అసలు దర్శకుడు సంతోష్ తోనే నిర్మాత మధు తీయించారు. బడ్జెట్ కూడా కాస్త ఎక్కువైనా వెనుకాడకుండా పూర్తి చేశారు ఇంతా చేసినా ఇంకా పూర్తి ప్రయోజనం నెరవేరలేదు.

ఇన్ సైడ్ టాక్ ప్రకారం అర్జున్ సురవరం జూన్ 21 విడుదల చేసేందుకు ప్లానింగ్ జరుగుతోందట ఇదీ అధికారిక ప్రకటన కాదు. సినిమా చాలా బాగా వచ్చిందని మంచి అవకాశాన్ని పోటీ పేరుతో వృధా చేసుకోవడం ఇష్టం లేక వాయిదా వేస్తున్నారని తెలిసింది. ఏవో ఆర్ధిక లావాదేవీలకు సంబంధించి కూడా చర్చలు జరుగుతున్నాయని మరికొన్ని పుకార్లు ఉన్నాయి.

ఇవన్నీ ప్రతి సినిమాకు జరిగేవే కానీ అర్జున్ సురవరం ఇకనైనా జూన్ 21 లేదా ఏదైనా మంచి డేట్ పక్కా చేసుకుని లాక్ చేసుకుని అభిమానులకు ఊరట కలిగించడం చాలా అవసరం. లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా నటించిన ఈ మూవీ జర్నలిజం ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ గా రూపొందింది