Begin typing your search above and press return to search.

శైలజను మిస్సయిన మెగా హీరోయిన్!

By:  Tupaki Desk   |   29 March 2019 8:10 AM GMT
శైలజను మిస్సయిన మెగా హీరోయిన్!
X
'దానే దానే పే లిఖాహై ఖానేవాలే కానే నామ్' అనే ఒక పాపులర్ హిందీ సామెత ఉంది. ప్రతి ధాన్యపు గింజపై దానిని ఎవరు తినాలో రాసిపెట్టి ఉంటుందట. అలానే ప్రతి కథకు ఎవరు చెయ్యాలో కూడా రాసి పెట్టే ఉంటుంది. ఎందుకంటే కథ ఒకరి కోసం తయారు చేసి మరో హీరోతో తెరకెక్కించిన సందర్భాలు బోలెడు. కొన్ని సార్లు అలా కొందరికి సూపర్ హిట్స్ కూడా చేజారిపోతుంటాయి. మెగా డాటర్ నిహారికకు అలాంటి సంఘటన ఒకసారి జరిగిందట.

నిహారిక తన తాజా చిత్రం 'సూర్యకాంతం' ప్రమోషన్స్ తో బిజీగా ఉంది. ఈ సందర్భంగా నిహారికకు ఒక ఇంట్రెస్టింగ్ ప్రశ్న ఎదురైంది. నిహారిక ఇప్పటివరకూ నటించిన సినిమాలన్నిటిలో ప్రధాన పాత్ర నిహారికదే. హీరో ఉన్నప్పటికీ కథ ప్రధానంగా నిహారిక పాత్ర చుట్టూ తిరుగుతుంది. మీరు అలాంటి సినిమాలను మాత్రమే ఎంచుకుంటారా నిహారిక? అని అడిగితే.. అలాంటిదేమీ లేదని అది పొరపాటు అభిప్రాయమని తెలిపింది. నిజానికి ఏ సినిమాలో అయినా కథ తన చుట్టూ తిరగాలనే పట్టుదల ఏమీ లేదని.. మంచి పాత్రలు ఇవ్వమని మాత్రం అడుగుతానని తెలిపింది.

దీనికి సంబంధించిన ఒక ఉదాహరణ చెబుతూ "నిజానికి 'నేను శైలజ'లో హీరోయిన్ ఆఫర్ నాకే మొదట వచ్చింది. ఆసమయంలో నేను హీరోయిన్ గా కెరీర్ ఎంచుకుని..ఇంట్లోవారిని ఒప్పించే ప్రయత్నాలలో ఉన్నాను. నేను శైలజ టీమ్ నాకోసం ఒక నెల పాటు వేచి చూశారు. నేను అప్పటికీ 'యస్' చెప్పలేకపోవడంతో ఆ సినిమా అవకాశం మిస్ అయింది" అని చెప్పింది. ఆ సినిమాలో హీరోయిన్ పాత్ర తర్వాత కీర్తి సురేష్ చేయడం ఆ సినిమా తనకు మంచి గుర్తింపు తీసుకురావడం తెలిసిందే కదా. ఆ సినిమా కనుక చేసి ఉంటే నిహారిక కెరీర్ ఓ రేంజ్ లో ఉండేదేమో..!