Begin typing your search above and press return to search.
డ్రగ్స్ మాఫియాతో సినీ ఇండస్ట్రీకి సంబంధం ఏంటి...?
By: Tupaki Desk | 5 Sept 2020 10:30 PM ISTడ్రగ్స్ వ్యవహారం మరోసారి సినీ ఇండస్ట్రీలను కుదిపేస్తోంది. బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణంతో తెరపైకి వచ్చిన డ్రగ్స్ వ్యవహారం.. ఇప్పుడు బాలీవుడ్ తో పాటు శాండిల్ వుడ్ మెడకు చుట్టుకుంటోంది. గతంలో పెను సంచలనంగా మారి నీరుగారిపోయిన డ్రగ్స్ వ్యవహారం.. మరోసారి తెరపైకి వచ్చింది. సినీ ఇండస్ట్రీలో పెద్ద ఎత్తున డ్రగ్స్ వాడకం జరుగుతోందని.. డ్రగ్స్ లేని పార్టీలు లేవంటూ వస్తున్న ఆరోపణలను సీరియస్ గా తీసుకున్న నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో అధికారులు మెల్లగా దీనిపై కూపీ లాగుతున్నారు. ఇప్పటికే బాలీవుడ్ లో డ్రగ్స్ కేసులో పలు అరెస్టులు జరిగాయి. ఇక శాండిల్ వుడ్ సినీ జర్నలిస్ట్ ఇంద్రజిత్ లోకేష్ ఇచ్చిన సమాచారం ఆధారంగా సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు.. డ్రగ్స్ డొంకను కదిలించే దిశగా అడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలో టాప్ హీరోయిన్ రాగిణి ద్వివేదిని అరెస్ట్ చేయడం.. మరో హీరోయిన్ సంజన గాల్రానీకు నోటీసులు ఇవ్వడం సంచలనంగా మారింది. అయితే ప్రతిసారి ఈ డ్రగ్స్ మాఫియా వ్యవహారం ఎప్పుడూ సినీ ఇండస్ట్రీ చుట్టే ఎందుకు తిరుగుతుందని అందరూ ఆలోచిస్తున్నారు.
కాగా, ఇండియాలో నిషేధిత డ్రగ్స్ ఫై కఠినంగా వ్యవహరిస్తుంటారు. అయినా సరే డ్రగ్స్ మాఫియాతో సినీ ఇండస్ట్రీకి ఉన్న లింక్స్ ఏదొక రూపంలో బయటపడుతూనే ఉండటం మనం చూస్తునే ఉంటాం. ముఖ్యంగా బాలీవుడ్ ప్రముఖులపై ఈ ఆరోపణలు ఎక్కువగా వస్తుంటాయి. అక్కడ స్టార్ హీరో హీరోయిన్లు డ్రగ్స్ దందాతో లింకులు కలిగి ఉంటారని అనేకమంది బాహాటంగా కామెంట్స్ చేశారు. ఇప్పుడు హీరోయిన్ కంగనా రనౌత్ సైతం రణవీర్ కపూర్ - రణవీర్ సింగ్ - విక్కీ కౌశల్ వంటి సెలబ్రిటీలపై డ్రగ్స్ ఆరోపణలు చేసింది. బాలీవుడ్ లో 99 శాతం డ్రగ్స్ తో నిండి ఉందని.. మాదకద్రవ్యాలు లేకుండా పార్టీలు ఉండవని.. నీళ్లలా తీసుకుంటారని చెప్పుకొచ్చింది. ఇక టాలీవుడ్ లో రెండేళ్ల క్రితం డ్రగ్స్ వ్యవహారం సెన్సేషన్ క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే అసలు డ్రగ్స్ మాఫియాకి సినీ ఇండస్ట్రీకి సంబంధం ఏంటని.. సినీ సెలబ్రిటీలపైనే డ్రగ్స్ ఆరోపణలు ఎందుకు వస్తుంటాయనేది జవాబు లేని ప్రశ్నగా మిగిలిపోయింది.