Begin typing your search above and press return to search.

బెల్లంకొండలకు వెయిటింగ్ తప్పదా?

By:  Tupaki Desk   |   13 April 2020 10:30 PM IST
బెల్లంకొండలకు వెయిటింగ్ తప్పదా?
X
బెల్లంకొండ శ్రీనివాస్ వరుసగా సినిమాలు చేస్తూ పోతున్నాడు కానీ ఇప్పటివరకు సాలిడ్ హిట్ అయితే దక్కలేదు. లాస్ట్ సినిమా 'రాక్షసుడు' ఏదో బ్రేక్ ఈవెన్ అనిపించుకుంది గాని అదేమీ సూపర్ డూపర్ హిట్ కాదు. కరోనా క్రైసిస్ వల్ల బెల్లంకొండ బాబుపై కాస్త ఒత్తిడి ఎక్కువ పడేలాగే ఉందని ఫిల్మ్ నగర్ లో టాక్ వినిపిస్తోంది.

బెల్లంకొండ శ్రీనివాస్ సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ కలెక్షన్లు నమోదు చేయకపోయినా.. డెఫిసిట్ వచ్చినా హిందీ డబ్బింగ్ రైట్స్ తో కవర్ చేసుకోవచ్చని ఒక ప్రచారం ఉంది. ఇవన్నీ పైకి చెప్పే మాటలు అని.. అసలు నిజం మాత్రం బెల్లంకొండ సురేష్ వెనుకనుంచి సపోర్ట్ చేయడం అని.. ఇండస్ట్రీలో చాలా మందికి తెలిసిన విషయమే. అయితే ఇప్పుడు కరోనా క్రైసిస్ కారణంగా బెల్లంకొండలకు రెగ్యులర్ గా అప్పులు ఇచ్చే ఫైనాన్షియర్లు సైతం వెనకడుగు వేస్తున్నారట. సూటిగా చెప్పుకోవాలంటే ఏఈ కరోనా క్రైసిస్ సద్దుమణిగి పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చే వరకు బెల్లంకొండలకు ఫండింగ్ కష్టమని.. బెల్లంకొండ శ్రీనివాస్ వెయిట్ చేయక తప్పదని అంటున్నారు.

ఇది ఒక ఎత్తయితే కరోనా లాంటి అవాంతరాలను ఊహించని బెల్లంకొండ ఫ్యామిలీ మరో హీరోను కూడా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే సినిమా షూటింగ్ కూడా జరుగుతోంది. దాదాపు పది సినిమాలు చేసిన బెల్లంకొండ శ్రీనివాస్ పరిస్థితే అర్థం కాకుండా ఉన్నప్పుడు ఇక తమ్ముడు గారి సంగతి ప్రత్యేకంగా చెప్పడానికి ఏముంటుంది?