Begin typing your search above and press return to search.

లాక్ డౌన్ ఎత్తేసాక ఆ ఇద్దరు అక్కినేని వారసుల సిచ్యుయేషన్ ఏంటి..?

By:  Tupaki Desk   |   15 April 2020 9:00 AM IST
లాక్ డౌన్ ఎత్తేసాక ఆ ఇద్దరు అక్కినేని వారసుల సిచ్యుయేషన్ ఏంటి..?
X
సినీ ఇండస్ట్రీలో ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ తో అడుపెట్టిన వారి లిస్ట్ చాలా పెద్దదే ఉంటుంది. అలా ఇంట్రడ్యూస్ అయిన వాళ్లలో కొందరు సక్సెస్ అవ్వగా మరికొందరు ఫెయిల్యూర్స్ గా మిగిలిపోయారు. వాస్తవానికి వారి మొదటి సినిమాకి మాత్రమే ఆ ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ ఉపయోగపడుతుంది. ఆ తర్వాత వారి టాలెంట్ తో నెట్టుకు రావాల్సిందే. అభిమానులు మాత్రం టాలెంట్ లేని ఆ హీరోలని ఎన్ని రోజులని వాళ్ళని భుజాల మీద వేసుకొని మోస్తారు చెప్పండి. మన టాలీవుడ్ విషయానికొస్తే మెగా ఫ్యామిలీ, అక్కినేని ఫ్యామిలీ, నందమూరి ఫ్యామిలీ, మంచు ఫ్యామిలీ.. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతీ ఫ్యామిలీ నుండి వారసులు ఇండస్ట్రీలోకి వస్తున్నారు.. వస్తూనే ఉంటారు కూడా. అయితే వారిలో మెగా ఫ్యామిలీ నుండి డజను మంది టాలీవుడ్ లో అడుగు పెట్టారు. అందరితో పోల్చుకుంటే వీరు అంతో ఇంతో సక్సెస్ అయ్యారనే చెప్పవచ్చు. అదే విధంగా నందమూరి, దగ్గుబాటి, మంచు ఫ్యామిలీ హీరోలు కూడా ఏదొక విధంగా బండి లాగుతున్నారు. అయితే అక్కినేని ఫ్యామిలీ విషయానికొస్తే.. ఈ ఫ్యామిలీ నుండి ఇప్పటి వరకు నాగచైతన్య, అఖిల్, సుమంత్, సుశాంత్ ఇండస్ట్రీలో అడుగు పెట్టారు. వీరిలో అక్కినేని నాగార్జున నటవారసులుగా నాగ చైత‌న్య‌కి, అఖిల్ కి ఏ మాత్రం డోఖా లేదని చెప్పవచ్చు.

ఇందులో నాగ చైత‌న్య అయితే ప్ర‌స్తుతం అక్కినేని కాంపౌండ్ ని లీడ్ చేస్తున్నాడని చెప్పవచ్చు. వరుస విజయాలతో వరుస ఆఫర్స్ సొంతం చేసుకుంటూ ఫార్మ్ లో ఉన్నాడు. చైతూకి బ‌య‌ట బ్యాన‌ర్లు నుంచి బాగానే సినిమాలు వ‌స్తున్నాయి. ఇక ట్రాక్ లోకి ఎక్కాల్సిన అఖిల్ కూడా అదే పని మీద తీవ్రంగా క‌ష్ట‌ప‌డుతున్నాడు. ప్రస్తుతం గీతా ఆర్ట్స్ సమర్పిస్తున్న 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్' సినిమాతో ట్రాక్ ఎక్కేలాగే కనబడుతున్నాడు. కింగ్ నాగార్జున విషయానికొస్తే ఈ వయసులో కూడా ఎవరికీ సాధ్యపడని ఛార్మింగ్ పర్సనాలిటీతో కొడుకులతో సమానంగా నిలుస్తున్నాడు. గతేడాది వచ్చిన 'మన్మథుడు 2' సినిమాతో నిరాశ పరిచినప్పటికీ వరుస సినిమాలని లైన్లో పెడుతూ కుర్ర హీరోలకే పోటీ వస్తున్నాడు. కానీ నాగార్జున మాత్రం ఆ ఫ్యామిలీకి ఎన్ని రోజులని 'కింగ్'గా నిలబడతాడు. వయస్సు రీత్యా చూసుకున్నా ఏదొక రోజు రిటైర్ అవ్వాల్సిందే కదా. ఇక ఇదే కాంపౌండ్ నుంచి వచ్చిన సుమంత్ విషయానికొస్తే.. గ‌జినీ మ‌హ‌మ్మ‌ద్ మాదిరి గ‌త 20 ఏళ్ల‌కు పైగా బ్లాక్ బ‌స్ట‌ర్ కోసం దండయాత్ర‌లు చేస్తూనే ఉన్నాడు. వాస్తవానికి 'ప్రేమకథ' సినిమాతో ఎంటర్ అయిన సుమంత్ కెరీర్లో సత్యం, పౌరుడు, మధుమాసం, గోల్కొండ హైస్కూల్, గోదావరి, మళ్లిరావా సినిమాలతో మంచి విజయాలను దక్కించుకున్నాడు. కానీ ఏం లాభం.. ఇండస్ట్రీ లో స్టార్ హీరోగా మాత్రం ఎదగ లేకపోతున్నాడు.

అలానే ప‌దేళ్లుగా అలుపెరగని పోరాటం చేస్తున్న సుశాంత్ ప‌రిస్థితే ఇప్పుడు ప్ర‌శ్నార్థ‌కంగా మారింది. 'కాళిదాస్' సినిమాతో ఇండస్ట్రీలో అడుగు పెట్టిన సుశాంత్ 'చిలసౌ' సినిమాతో సూపర్ హిట్ అందుకున్నప్పటికీ వెంటనే 'అల వైకుంఠపురంలో' సినిమాలో ఏమాత్రం ప్రాధాన్యతలేని క్యారెక్టర్ పోషించి అభిమానులను నిరాశపరిచాడు. సొంత బిడ్డ‌ల‌ని ఇండస్ట్రీలో నిలబెట్టాలని ట్రై చేస్తున్న నాగ్ కి క‌రోనా క్రైసిస్ త‌రువాత ఈ ఇద్ద‌రి మేన‌ల్లుల్ని ట్రాక్ ఎక్కిచాలంటే చాలా పైర‌వీలు, ఏంజిల్ ఇన్వెస్టిట్మెంట్లు చేయాల్సిన ప‌రిస్థితి ఏర్పడింది. మ‌రి లాక్ డౌన్ ఎత్తేశాక ఈ ఇద్ద‌రు హీరోల సిచ్యుయేషన్ ఏంటో చూడాలి. ప్రస్తుతం సుమంత్ 'కపటదారి', సుశాంత్ 'ఇచ్చట వాహనములు నిలుపరాదు' చిత్రాలతో ముందుకొస్తున్నారు. ఈ చిత్రాలతోనైనా వీళ్ళిద్దరూ ట్రాక్ లోకి వస్తారేమో చూడాలి.