Begin typing your search above and press return to search.

ఆ దర్శకుడి విషయంలో టాలీవుడ్ స్టార్ హీరోలకు ఏమైంది..??

By:  Tupaki Desk   |   28 Jun 2021 5:36 AM GMT
ఆ దర్శకుడి విషయంలో టాలీవుడ్ స్టార్ హీరోలకు ఏమైంది..??
X
టాలీవుడ్ ఇండస్ట్రీలో కమర్షియల్ అంశాల జోలికి వెళ్లకుండా ఫ్యామిలీ - ఫ్రెండ్స్ - ఎమోషన్స్ నేపథ్యంలో డీసెంట్ సినిమాలు తెరకెక్కించే దర్శకుడు ఎవరైనా ఉన్నారంటే ముందుగా శేఖర్ కమ్ముల పేరే చెప్పుకోవాలి. ఎందుకంటే ఇప్పటివరకు ఆయన కెరీర్ లో తక్కువ సినిమాలే చేసి ఉండవచ్చు. కానీ అన్ని సినిమాలు బాక్సాఫీస్ దగ్గర మంచి ప్రభావం చూపినవే. అయితే స్టార్ డైరెక్టర్స్ అందరూ బడా హీరోలతో సినిమాలు హిట్ కొట్టడానికి నానా తంటాలు పడుతుంటారు. ఈ దర్శకుడి పంథా వేరు. ఇంతవరకు ఒక్క స్టార్ తో కూడా సినిమా చేయకుండా బ్లాక్ బస్టర్స్ అందుకున్నాడు.

శేఖర్ కమ్ముల సినిమాలు అంటేనే ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి సూపర్ హిట్ అందుకొని వెళ్తుంటాయి. రావడం ఆలస్యంగానే రావచ్చు కానీ మినిమం గ్యారంటీ అనేలా మారాడు. అయితే కెరీర్ లో గోదావరి.. ఆనంద్.. హ్యాపీడేస్.. లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్.. ఫిదా లాంటి హిట్స్ ఉన్నప్పటికీ ఇంతవరకు ఒక్క టాలీవుడ్ స్టార్ హీరోతో సినిమా చేయకపోవడం ఆశ్చర్యం కలిగించే విషయం. దానికి సమాధానం కూడా "ఏదో అలా కుదరలేదండి" అని సింపుల్ గా చెప్పేస్తుంటాడు దర్శకుడు. కానీ ప్రేక్షకులు.. ఫ్యాన్స్ మాత్రం ఏవేవో ఊహగానాల్లో ఉంటున్నారు.

పదిహేనేళ్లు పైనే తెలుగులో దర్శకుడుగా కొనసాగుతున్నాడు శేఖర్.. అలాంటి దర్శకుడిని ఇంతవరకు టాలీవుడ్ ఒక స్టార్ హీరో కూడా సినిమా చేయకపోవడం గమనార్హం. ఎందుకంటే ఫిదా సినిమా తర్వాత శేఖర్ అక్కినేని హీరో నాగచైతన్యతో లవ్ స్టోరీ తీసాడు. అది ఇంకా రిలీజ్ కావాల్సి ఉంది. అయితే ఇంతలోనే తాజాగా తమిళ స్టార్ హీరో ధనుష్ తో శేఖర్ సినిమా ప్రకటించి షాకిచ్చాడు. బేసిగ్గా ఓ నేషనల్ అవార్డు విన్నింగ్ దర్శకుడితో మరో నేషనల్ అవార్డు యాక్టర్ సినిమా కాంబినేషన్ సంతోషించాల్సిందే. కానీ ఓ తమిళ హీరో శేఖర్ తో సినిమా చేయడానికి ముందుకొచ్చాడు. కానీ తెలుగు హీరోలు మాత్రం చూస్తూనే ఉంటున్నారు. ఇంతవరకు తెలుగుకే పరిమితం అయినటువంటి శేఖర్ ధనుష్ తో ఏకంగా త్రిభాషా చిత్రం ప్రకటించాడు. చూడాలి మరి ఈసారి తన సత్తా దేశవ్యాప్తంగా చాటుతాడేమో!