Begin typing your search above and press return to search.

మెగా ఫ్యాన్స్ వర్సెస్ అల్లు ఫ్యాన్స్ ఏం జరిగిందంటే ?

By:  Tupaki Desk   |   30 Sep 2019 5:15 AM GMT
మెగా ఫ్యాన్స్ వర్సెస్ అల్లు ఫ్యాన్స్ ఏం జరిగిందంటే ?
X
మెగా కాంపౌండ్ లో కొన్ని సందర్భాల్లో ఫ్యాన్స్ రెండుగా చీలిపోతున్నారు. మెగా ఫ్యాన్స్ - అల్లు ఫ్యాన్స్ ఎవరికి వారు సెపరేట్ గా ఉంటున్నారు. దీనికి రీజన్స్ చాలానే ఉన్నాయి. ఆ మధ్య పవన్ కళ్యాణ్ గురించి చెప్పండి అని అడగ్గా చెప్పను బ్రదర్ అంటూ ఈవెంట్ లో మెగా ఫ్యాన్స్ మీద సీరియస్ అయ్యాడు బన్నీ. అప్పటి నుండి మెగా ఫ్యాన్స్ బన్నీని వేరుగా చూడటం మొదలుపెట్టారు. చాలా రోజులు ఫ్యాన్స్ మధ్య ఆ వివాదం నడిచింది. ఓ సందర్భంలో బన్నీ పవన్ ని కలిసి కౌగిలించుకోవడంతో ఇక వివాదం ముగిసింది.

అయితే లేటెస్ట్ గా మళ్లీ మెగా ఫ్యాన్స్ కి అల్లు ఫ్యాన్స్ కి అగ్గి రాజేసుకుంటుంది. సైరా ఈవెంట్ కి మెగా ఫ్యామిలీ హీరోలంతా హాజరయ్యారు ఒక్క బన్నీ తప్ప. ఇదే మెగా అభిమానులకు కోపం తెప్పించింది. చిరంజీవి ప్రతిష్టాత్మక సినిమా ప్రమోషన్స్ కు బన్నీ దూరంగా ఉండటం పైగా 'సైరా' ప్రమోషన్స్ జరుగుతున్న టైంలో సరిగ్గా తన సినిమా పాటను రిలీజ్ చేయడం మెగా ఫ్యాన్స్ కి బన్నీ పై మరింత కోపం తెప్పించింది.

అందుకే కొన్ని థియేటర్స్ దగ్గర మెగా బ్యానర్లో బన్నీ ఫోటోలు పెట్టకుండానే మెగా ఫ్యాన్స్ ఫ్లెక్సీలు కట్టారు ఫ్యాన్స్. ఇక దీనిపై బన్నీ ఫ్యాన్స్ గుర్రుమన్నారు. మెగా అభిమానులు కడుతున్న కొన్ని బ్యానర్స్ లో అల్లు అర్జున్ ఫోటో లేకపోవడంతో చర్చ లేపారు. గ్రూప్ ల్లో చర్చించుకుని బన్నీ ఫ్లెక్సీ లు మెగా అభిమానులు పెట్టకపోతే తమే పెట్టాలని డిసైడ్ అయ్యారు. ఈ మేరకూ బన్నీ ఫ్యాన్స్ గ్రూప్ లో హాట్ హాట్ గా డిస్కర్షన్స్ నడుస్తున్నాయట. మరి మళ్లీ మెగా & అల్లు ఫ్యాన్స్ మధ్య ముదిరిన ఈ వివాదం ఎక్కడికి దారి తీస్తుందో...?