Begin typing your search above and press return to search.

జాన్వీ చేతికి ఏమైంది సెడెన్ గా ..?

By:  Tupaki Desk   |   11 Dec 2021 4:30 PM GMT
జాన్వీ చేతికి ఏమైంది సెడెన్ గా ..?
X
సోష‌ల్ మీడియా వేదికగా జాన్వీ క‌పూర్ హాట్ ఫోటోషూట్ల‌కు ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. నేటిత‌రం స్టార్ల‌లో జాన్వీ స్పీడ్ గురించి నిరంత‌రం చ‌ర్చ సాగుతోంది. వేడెక్కించే బికినీలు స్విమ్ సూట్లు పొట్టి నిక్క‌ర్ల‌తో జాన్వీ సంద‌డి అంతా ఇంతా కాదు.

ఇటీవ‌ల మాల్దీవుల నుంచి అదిరిపోయే ఫోటోషూట్ ని షేర్ చేసింది. ఇంత‌లోనే కెరీర్ ప‌రంగా ఆన్ సెట్స్ ఉన్న ప్రాజెక్టుల‌తో జాన్వీ బిజీ అయ్యింది. కానీ స‌డెన్ గా ఏమైందో కానీ జాన్వీ క‌పూర్ ఇలా చేతికి క‌ట్టుతో క‌నిపించింది.

ఏదైనా యాక్సిడెంటా.. ఆ చేతికి ఏమైంది? బెణికిందా.. ఫ్యాక్చ‌రా? మొత్తానికి గాయం పెద్ద‌దేన‌ని అర్థ‌మ‌వుతోంది. జాన్వీ అలా చ‌క‌చ‌కా అడుగులు వేసుకుంటూ త‌న కార్ వైపు వెళుతుంటే ఫోటోగ్రాఫ‌ర్లు సైతం ఎంతో గౌర‌వంగా ``జాన్వీజీ జాగ్ర‌త్త‌గా వెళ్లండి!`` అంటూ సాగ‌నంపుతున్నారు. నిజంగా జాన్వీకి అంత‌గా ఇండ‌స్ట్రీలో గౌర‌వం ఉంది. దానికి కార‌ణం త‌న‌లోని డౌన్ టు ఎర్త్ స్వ‌భావ‌మే. ప్ర‌స్తుతం వ‌రుస చిత్రాల‌తో ఈ న‌ట‌వార‌సురాలు బిజీబిజీగా ఉంది. జాన్వీ క‌పూర్ సినిమాల లైన‌ప్ చూస్తే `దోస్తానా2 `లో న‌టిస్తోంది. అలాగే `గుడ్ ల‌క్ జెర్రీ`..`మిలీ` చిత్రాల‌ షూటింగ్ ని పూర్తిచేసింది. త్వ‌ర‌లో అవి ప్రేక్ష‌కుల ముందుకు రానున్నాయి.