Begin typing your search above and press return to search.

ఆత్మహత్యకు పది రోజుల ముందు ఏం జ‌రిగింది?

By:  Tupaki Desk   |   14 Jun 2022 3:55 AM GMT
ఆత్మహత్యకు పది రోజుల ముందు ఏం జ‌రిగింది?
X
గూగుల్ సెర్చ్ రికార్డుని బ‌ట్టి ఎదుటి వ్య‌క్తి వ్య‌క్తిత్వాన్ని కూడా అంచ‌నా వేయొచ్చు. అత‌డు లేదా ఆమె భ‌విష్య‌త్ లో ఏం చేయ‌బోతున్నారు? అన్న‌దానికి ఇక్క‌డ ఆధారాలు ల‌భ్య‌మ‌య్యేందుకు ఛాన్స్ ఉంది. అలాగే ఒక వ్య‌క్తి ఫోన్ ని ఉన్న ఫ‌లంగా ఛేజిక్కించుకోగ‌లిగితే అందులో చాలావ‌ర‌కూ తాజా ప‌రిణామాల‌కు సంబంధించిన‌ మిస్ట‌రీ రివీల‌య్యేందుకు ఛాన్సుంది. ఇదంతా పోలీస్ ఇన్వెస్టిగేష‌న్ లో ఒక భాగం. ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ ప్రత్యూష గరిమెళ్ల ఆత్మహత్య వెన‌క కార‌ణాల్ని పోలీసులు క‌నుగొనే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ఈ కేసు దర్యాప్తులో అనేక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. దొరికిన సూసైడ్ నోట్ ఆమె స్వ‌యంగా రాసిన‌దేన‌ని నిర్ధారించిన పోలీసులు మృతదేహం దగ్గర దొరికిన కార్బన్ మోనాక్సైడ్ బాటిల్ ఎక్కడి నుంచి వచ్చిందనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

ప్రత్యూష కొంతకాలంగా తీవ్ర డిప్రెషన్‌తో బాధపడుతున్నట్లు సమాచారం. ఆమె ఇంటర్నెట్ బ్రౌజింగ్ చరిత్ర ఆత్మహత్య కోసం ప్రిప‌రేష‌న్ ని కూడా సూచించింద‌ని శోధ‌న‌లో వెల్ల‌డైంది. ఫ్యాష‌న్ డిజైన‌ర్ ఆత్మ‌హ‌త్య‌కు ముందు గూగుల్ లో చాలా శోధించింది. నొప్పిలేని మరణం కోసం వెతికింది. అదే క్ర‌మంలో కార్బ‌న్ మోనాక్సైడ్ వినియోగంపై ఆలోచ‌న వ‌చ్చింది. ఇక త‌న మ‌ర‌ణానికి ముందు అసంతృప్తిక‌ర జీవితం గురించి స్నేహితుల వ‌ద్ద ప్ర‌స్థావించేద‌ని కూడా పోలీసులు తెలుసుకున్నారు. ప్రత్యూష స‌రిగ్గా ఆత్మహత్యకు పది రోజుల ముందు ప్ర‌తిదీ సిద్ధం చేసుకుంది.

కుటుంబానికి దూరంగానే ఇదంతా జ‌ర‌గాలి కాబ‌ట్టి ప్లాన్డ్ గా తన జీవితాన్ని బోటిక్ లోనే ముగించాలని ఎంచుకుంది. అక్క‌డే త‌న‌ని తాను అంతం చేసుకుంది. ప్ర‌స్తుతం ఈ కేసు ద‌ర్యాప్తులో ఉంది. పోలీసులు ప్ర‌త్యూష ఆనుపానుల‌పై ఆరాలు తీస్తున్నారు. త‌న సెల్ ఫోన్ లో అస‌లు ర‌హ‌స్యం బ‌య‌ట‌ప‌డుతుంద‌ని భావిస్తున్నారు. త‌న సూసైడ్ వెన‌క అస‌లు కార‌ణ‌మేమిటి? అన్న‌ది తెలియాల్సి ఉంటుంది. ముందుగా ఫోన్ ని అన్ లాక్ చేస్తే వివ‌రాలు బ‌య‌ట‌ప‌డే ఛాన్సుంద‌ని భావిస్తున్నారు.

ఇది నేను కోరుకున్న జీవితం కాదు!

ఫ్యాష‌న్ డిజైన‌ర్ ప్ర‌త్యూష గ‌రిమెళ్ల అనుమానాస్ప‌ద మృతి వెన‌క తీవ్ర‌మైన ఒత్తిడి దాగి ఉంది. ప్ర‌త్యూష ఆత్మ‌హ‌త్య చేసుకున్నార‌ని ప్రాథ‌మికంగా క‌థ‌నాలు వ‌చ్చినా దీనిని పోలీసులు అనుమానాస్ప‌ద మృతిగా న‌మోదు చేసి ద‌ర్యాప్తును కొన‌సాగిస్తున్నారు. ప్ర‌త్యూష రాసిన సూసైడ్ నోట్ ని పోలీసులు స్వాధీనం చేసుకుని విచారిస్తున్నారు. ఇందులో ఇది తాను కోరుకున్న జీవితం కాద‌ని.. నేను నా త‌ల్లిదండ్రుల‌కు భారంగా మార‌లేను! అంటూ ప్ర‌త్యూష ఆవేద‌న వెలిబుచ్చార‌ని స‌మాచారం. రిటైర్డ్ ఐఆర్ ఎస్ కృష్ణారావు కుమార్తె ప్ర‌త్యూష‌. ఇండియాలో టాప్ 30 డిజైన‌ర్ల‌లో ఒక‌రిగా ఓ వెలుగు వెలిగిన ప్ర‌త్యూష‌కు ఆర్థిక‌ప‌ర‌మైన క‌ష్టాలేవీ లేవు. కానీ ఇంత‌లోనే ఆత్మ‌హ‌త్య చేసుకోవాల్సిన అవ‌స‌ర‌మేమిటీ? అన్న కోణంలో ద‌ర్యాప్తు సాగుతోంది.

ప్రత్యూష అమెరికాలో ఫ్యాషన్ డిజైనింగ్ చదివి హైదరాబాద్ లో కెరీర్ ప్రారంభించింది. ఆమె 2013లో తన పేరు మీద ఒక లేబుల్ ని ప్రారంభించింది. కెరీర్ ప‌రంగా వెనుదిరిగి చూసేది లేదు. ఆమె టాలీవుడ్ బాలీవుడ్ లో చాలా మంది ప్రముఖ సెల‌బ్రిటీల కోసం ప్ర‌త్యూష‌ పనిచేసింది. ఆమె ఖాతాదారులలో చాలా పెద్ద పేర్లు ఉన్నాయి. కాజ‌ల్ అగ‌ర్వాల్- శ్రీయా శ‌ర‌ణ్ -రవీనా టాండన్- పరిణీతి చోప్రా- హుమా ఖురేషి- కాజోల్- మాధురీ దీక్షిత్- జూహీ చావ్లా- గౌహర్ ఖాన్- నేహా ధూపియా- భూమి పెడ్నేకర్ వంటి పలువురు బాలీవుడ్ ప్రముఖుల కోసం ప్ర‌త్యూష గరిమెళ్ల డిజైనర్ గా ప‌ని చేసారు.

అనుమానాస్ప‌ద మ‌ర‌ణాలు ఎల్ల‌పుడూ విచార‌క‌రం. యువ ప్రతిభావ‌ని అకాల మరణం ప‌రిశ్ర‌మ‌లో కుటుంబ స‌భ్యులు బంధుమిత్రులతో పాటు స‌హ‌చ‌రుల‌ను క‌ల‌చివేస్తోంది. ఇది ఆత్మ‌హ‌త్య‌నా కాదా? అన్న‌ది పోలీసులే తేల్చనున్నారు.