Begin typing your search above and press return to search.

ద‌ర్శ‌కుడితో హీరో వైరంలో మ‌రో కోణం?

By:  Tupaki Desk   |   4 Feb 2020 1:15 PM IST
ద‌ర్శ‌కుడితో హీరో వైరంలో మ‌రో కోణం?
X
అభిప్రాయ భేధాలు అనాలా.. లేక ఇంకేదైనానా? మొత్తానికి యువ‌హీరో నాగ‌శౌర్య‌కు ఛ‌లో లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్ ఇచ్చిన వెంకీ కుడుముల ప్ర‌స్తుతం త‌న‌కు తొలి అవ‌కాశం ఇచ్చిన హీరోకి దూర‌మ‌వ్వ‌డం అభిమానుల‌కు ఆశ్చ‌ర్యం క‌లిగిస్తోంది. శౌర్య‌తో ఆ కుటుంబంతో ఎంతో ఇదిగా క‌లిసిపోయిన వెంకీ కుడుముల ఇపుడు మ‌రోసారి ఐరా క్రియేష‌న్స్ కాంపౌండ్ వైపు చూడ‌క‌పోవ‌డంతో గొడ‌వ‌లు తారా స్థాయిలో జ‌రిగాయ‌ని అర్థ‌మైంది. ఇక నాగ‌శౌర్య బ‌హిరంగంగానే వెంకీ కుడుముల‌తో ఉన్న గొడ‌వ‌ల్ని ప్ర‌స్థావించ‌డంతో ఒక్కో చిక్కు ముడి వీడుతోంది.

అశ్వ‌థ్థామ ప్ర‌చారంలో భాగంగా వెంకీతో గొడ‌వ విష‌య‌మై శౌర్య వెర్ష‌న్ ఒక‌టి బ‌య‌టికి వ‌చ్చింది. ఛ‌లో క‌థ తానే రాశాన‌ని చాలాసార్లు శౌర్య త‌న‌కు తానే ప్ర‌క‌టించుకున్నాడు. అయితే నిజానికి అది వెంకీ కుడుముల క‌థ‌. అయినా తానే ఈ క‌థ‌ను డెవ‌ల‌ప్ చేశాను అని క్రెడిట్ కొట్టేసినా దానికి వెంకీ కూడా ఏమీ స్పందించ‌క‌పోవ‌డంతో అప్ప‌టికి గొడ‌వ సైలెంట్ అయిపోయింది. ఈ మ‌ధ్య రిలీజైన అశ్వ‌థ్థామ పై మిశ్ర‌మ స్పంద‌నల నేప‌థ్యంలో ఆ సినిమాని ఎలా అయినా యావ‌రేజ్ అయినా చేయాల‌ని క‌సిగా త‌పించిన శౌర్య మ‌రోసారి పాత గొడ‌వ‌ల్ని బ‌య‌ట‌కు తీశాడు. మ‌ళ్లీ వెంకీని టార్గెట్ చేయ‌డానికి కార‌ణం అదే.

ఛ‌లో నిర్మాత ఉష గారు ఇచ్చిన కార్ ని కూడా వెంకీ వ‌దిలేసి వెళ్లిపోయాడు అని శౌర్య చెప్పాడు. నిజానికి ఈ కార్ ని వెంకీ నుంచి లాక్కుంది ఐరా వాళ్లే. ఈ నిజాలు అన్నీ దాచేసి శౌర్య త‌న వెర్ష‌న్ మాత్ర‌మే చెబుతున్నాడు. మ‌రి వెంకీ త‌న వెర్ష‌న్ విష‌యంలో ఎప్పుడు ఓపెన్ అవుతాడో చూడాలి. ఎలానూ `భీష్మ‌`కు ప్ర‌చారం కావాలి కాబ‌ట్టి వెంకీ అప్పుడు ఓపెన్ అవుతాడనే భావిద్దాం!!