Begin typing your search above and press return to search.

మాస్ మహారాజాకు ఏమైంది.. ఎందుకిలా... ?

By:  Tupaki Desk   |   1 Nov 2021 8:00 AM IST
మాస్ మహారాజాకు ఏమైంది.. ఎందుకిలా... ?
X
ఆయన పేరే మాస్ మహారాజా. టోటల్ బాడీ లాగ్వేజ్ తోనే ఇటు మాస్ ని అటు కామెడీని పండించేయగల సమర్ధుడు. డైలాగ్ డిక్షన్ సెపరేట్. ఎటకారం డాట్ కమ్ కి పర్యాయపదంగా మాటల దూకుడు ఉంటుంది. హీరో అంటే ఈ యాంగిల్ లో కూడా కుమ్మేయొచ్చు అని ప్రూవ్ చేసి మరీ రెండు దశాబ్దాలుగా టాలీవుడ్ లో సత్తా చాటుతున్నాడు. రవితేజా చిన్న పాత్రలను ఎన్నో వేసి చివరికి కృషిని కసిని నమ్ముకుని స్టార్ హీరోగా సెటిల్ అయ్యాడు. ఆయన మార్క్ మ్యానరిజంతో ఒక తరాన్ని మెస్మ‌రైజ్ చేశాడు. అయితే కొన్నాళ్ళ క్రితం వరస ఫ్లాప్స్ తో మాస్ మహారాజా ఇబ్బంది పడ్డారు కానీ క్రాక్ మూవీతో తిరిగి సక్సెస్ రూట్లోకి వచ్చేశాడు. ఇక లైన్ లో పెట్టిన సినిమాల లిస్ట్ చూస్తే మరి కొన్నాళ్ల పాటు స్ట్రాంగ్ గా వెండి తెరని ఏలేయగ‌లడు అనిపించేస్తోంది.

రవితేజా ఖిలాడీ మూవీ కంప్లీట్ అయింది. ఆ తరువాత నక్కిన త్రినాధరావు మూవీ ఉంది. మరో రెండు మూవీస్ కూడా క్యూలో ఉండగానే 70వ సినిమాను లేటెస్ట్ గా అనౌన్స్ చేశాడు. రవితేజా జోరు చూస్తూంటే తొందరలోనే వంద చిత్రాలు పూర్తి చేస్తాడు అనిపించేస్తోంది. కరోనా తరువాత రెండేళ్ళకు కూడా ఒక సినిమా చేస్తే గొప్ప అన్నట్లుగా పరిస్థితి ఉంది. అదే టైమ్ లో సినిమాలు తీయడానికి కూడా కొంత ఫియర్ కనిపిస్తోంది.

అయినా సరే రవితేజా అంటే ప్రాణం పెట్టే డైరెక్టర్స్, నిర్మాతలు ఉన్నారు. దాంతో రవితేజా అసలు ఆలస్యం చేయడంలేదు. తనతో ఎవరు మూవీస్ చేస్తోరో చేసుకోండి అంటూ కాల్షీట్లు వరసబెట్టి ఇచ్చేస్తున్నారు. మినిమం గ్యారంటీ హీరోగా పేరున్న రవితేజాతో మూవీ అంటే కచ్చితంగా సేఫ్ జోన్ లోనే ఉండొచ్చు అన్నదే మేకర్స్ ఆలోచన. ఇక స్పీడ్ గా షూటింగ్ పూర్తి చేసే అతి తక్కువ హీరోల్లో రవితేజా ఒకరు. దాంతో బడ్జెట్ ఓవర్ కావడం, ఇతరాత్రా ఇబ్బందులు తలెత్తడం వంటివి మాస్ రాజా మూవీస్ లో అసలు కనిపించవు.

ఇక కరోనా తరువాత మారిన నేపధ్యంలో ఓటీటీ పోటీతో ధియేటర్లకు కూడా మంచి ఫీడింగ్ కావాలి. అలా ఇచ్చేందుకు టాలీవుడ్ నుంచి ఫస్ట్ ముందుకు వచ్చిన హీరోగా రవితేజాను చెప్పుకోవాలి. రవితేజా హుషార్ చూస్తూంటే ఏడాదికి ఒకటీ రెండూ కాదు మూడు నాలుగు సినిమాలు రిలీజ్ చేసేలా ఉన్నాడు. ఒక విధంగా పాత రోజుల్లో సూపర్ స్టార్ క్రిష్ణను గుర్తుకు తెస్తూ మరీ దూకుడు చేస్తున్న మాస్ మహారాజా సినిమా తరువాత సినిమా అంటూ ఎక్కడా తగ్గడంలేదు. ఇది టాలీవుడ్ మేకర్స్ కి వరంగా మారుతోంది. ఇలా మిగిలిన హీరోలు కూడా పోటీ పడితే మళ్లీ టాలీవుడ్ కళకళలాడడం ఖాయమని సినీ పండిట్స్ అంటున్నారు.