Begin typing your search above and press return to search.

మ‌హేష్ గురించి అడివి శేష్ ఏమ‌న్నాడు?

By:  Tupaki Desk   |   26 Nov 2022 7:30 AM GMT
మ‌హేష్ గురించి అడివి శేష్ ఏమ‌న్నాడు?
X
సూప‌ర్‌స్టార్ మ‌హేష్ బాబు గురించి ఎవ‌రికీ తెలియ‌ని షాకింగ్ విష‌యాల్ని తాజాగా యంగ్ హీరో అడివి శేష్ బ‌య‌ట పెట్టాడు. 2022.. ఈ ఏడాది మ‌హేష్ బాబు జీవితంలో జీక‌టి ఇయ‌ర్ అని చెప్ప‌క త‌ప్ప‌దు. ఈ ఏడాది ప్రారంభంలో మ‌హేష్ త‌కు అత్యంత ఇష్ట‌మైన అన్న‌య్య ర‌మేష్ బాబుని కోల్పోయిన విష‌యం తెలిసిందే. ఈ బాధ నుంచి మ‌హేష్ బాబు తేరుకుంటుండ‌గానే మ‌రో చేదు వార్త వినాల్సి వ‌చ్చింది. అన్న చ‌నిపోయిన బాధ‌లో నిత్యం భావోద్వేగానికి గుర‌వుతున్న మ‌హేష్ వెంట‌నే త‌ల్లి ఇందిరా దేవిని కోల్పోయారు.

మ‌హేష్ తో పాటు త‌న‌ని అమితంగా ఇష్ట‌ప‌డే అభిమానుల‌..సాధారణ వ్య‌క్తులు కూడా మ‌హేష్ ప‌రిస్థితిని చూసి త‌ల్ల‌డిల్లి పోయారు. ఇలా వెంట వెంట‌నే నెల‌లు తిర‌క్కుండానే ఇద్ద‌రు ఇష్ట‌మైన వ్య‌క్తుల‌ని కోల్పోవ‌డంతో మ‌హేష్ బాబు కొంత మాన‌సిక వేద‌న‌కు గుర‌య్యార‌ట‌. ఇక ఇద్ద‌రిని కోల్పోయిన బాధ‌లో వున్న మ‌హేష్ కు వెంట‌నే మ‌రో షాక్ తగిలిన విష‌యం తెలిసిందే. రీసెంట్ గా మ‌హేష్ ఫాద‌ర్‌, సూప‌ర్ స్టార్ కృష్ణ అక‌స్మాత్తుగా మృతి చెంద‌డంతో మ‌మేష్ మ‌రింత మ‌నో వేద‌న‌కు గుర‌వుతున్నార‌ట‌.

ఒకే ఏడాది త‌న‌కు అత్యంత ఇష్ట‌మైన ముగ్గురు కుటుంబ స‌భ్యుల‌ని కోల్పోవ‌డంతో మ‌హేష్ త‌ట్టుకోలేక‌పోతున్నాడ‌ట‌. ఆ బాధ నుంచి బ‌య‌టికి రాలేక‌పోతున్నాడ‌ని తెలుస్తోంది. అంతే కాకుండా చాలా భావోద్వేగానికి గుర‌వుతున్న మ‌హేష్ ఓలాంటి ఫోన్ కాల్స్ ని ప‌ట్టించుకోవ‌డం లేద‌ని, భార్య న‌మ్ర‌త‌తో మాత్ర‌మే మాట్లాడుతున్నాడ‌ని తెలుస్తోంది. ఇదే విష‌యాన్ని తాజా హీరో అడివి శేష్ ఓ మీడియాకు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో వెల్ల‌డించి షాకిచ్చాడు.

అడివి శేష్ న‌టించిన లేటెస్ట్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ 'హిట్ 2 : ది సెకండ్ కేస్‌'. డిసెంబ‌ర్ 2న రిలీజ్ అవుతున్న నేప‌థ్యంలో ఈ మూవీ ప్ర‌మోష‌న్స్ ని స్టార్ట్ చేశారు. ఈ సంద‌ర్భంగా ఓ మీడియాకు ప్ర‌త్యేకంగా ఇంట‌ర్వ్యూ ఇచ్చిన హీరో అడివి శేష్ ఈ సంద‌ర్భంగా మ‌హేష్ ఎదుర్కొంటున్న విప‌త్క‌ర ప‌రిస్థితి గురించి, ఆయ‌న మాన‌సిక వేద‌న గురించి వెల్ల‌డించి ఆశ్చ‌ర్య‌ప‌రిచాడు. 'మేజ‌ర్‌' సినిమా నుంచి మ‌హేష్ ఫ్యామిలీకి అడివి శేష్ ద‌గ్గ‌ర‌య్యాడు.

ఆ చ‌నువుతో మ‌హేష్ తాజా ప‌రిస్థితిని న‌మ్ర‌త‌ని అడిగి తెలుసుకుంటున్నాడ‌ట‌. 'మహేష్ సార్ ప్ర‌స్తుతం అనుభ‌విస్తున్న బాధ వ‌ర్ణించ‌లేనిద‌ని, ఎవ‌రికి కూడా ఇలాంటి బాధ రాకూడ‌ద‌ని, మ‌హేష్ కు మాన‌సిక ధైర్యాన్ని ఆ దేవుడు అందించాల‌న్నారు.

అంతే కాకుండా మ‌హేష్ సార్ ఫోన్ కు అందు బాటులో వుండ‌టం లేద‌ని, ఫోన్ కాల్స్ ని అవాయిడ్ చేస్తున్నార‌ని, నేను మాత్రం న‌మ్ర‌త గారితో ట‌చ్ లో వుంటున్నాన‌ని ప్ర‌స్తుతం మ‌హేష్ ఎదుర్కొంటున్న విప‌త్క‌ర ప‌రిస్థితిని ఎదుర్కొంటున్నాడో వెల్ల‌డించ‌డంతో ఫ్యాన్స్ భావోద్వేగానికి లోన‌వుతున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.