Begin typing your search above and press return to search.

'అఖండ' గురించి టాలీవుడ్ హీరోలు ఏమన్నారంటే..?

By:  Tupaki Desk   |   2 Dec 2021 2:30 PM GMT
అఖండ గురించి టాలీవుడ్ హీరోలు ఏమన్నారంటే..?
X
నటసింహం నందమూరి బాలకృష్ణ - డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో తెరకెక్కిన తాజా చిత్రం ''అఖండ''. 'సింహా' 'లెజెండ్‌' తర్వాత వీరి కాంబోలో రూపొందిన ఈ హ్యాట్రిక్‌ మూవీ ఈరోజు గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచాల నడుమ విడుదలైన ఈ హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ తొలి రోజే హిట్ టాక్ తో దూసుకుపోతోంది. కరోనా సెకండ్ వేవ్ తర్వాత థియేటర్లలో వచ్చిన పెద్ద సినిమాగా.. టాలీవుడ్ బాక్సాఫీస్ కు కళ తీసుకొచ్చిందని విశ్లేషకులు చెబుతున్నారు.

'అఖండ' లో మురళీకృష్ణ - శివుడిగా ద్విపాత్రాభినయం చేసిన బాలయ్య.. బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్నాడని సోషల్ మీడియాలో ప్రశంసలు కురుస్తున్నాయి. మాస్‌, క్లాస్‌ అని తేడా లేకుండా అందరూ ఈ సినిమాను ఆస్వాదిస్తున్నారని తెలుస్తోంది. బాలకృష్ణ శైలి పంచ్‌ డైలాగులు - బోయపాటి తరహా యాక్షన్‌ ఎపిసోడ్స్‌ - థమన్ అందించిన బ్యాగ్రౌండ్ స్కోర్ సినిమాని మరోస్థాయికి తీసుకెళ్లాయని అంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా.. యూఎస్ లోనూ 'జై బాలయ్య' స్లోగన్స్ గట్టిగా వినిపిస్తున్నాయి.

ఇకపోతే 'అఖండ' సినిమాకు పాజిటివి రెస్పాన్స్ తెచ్చుకోవడంపై సినీ ప్రముఖులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. చిత్ర బృందానికి అభినందనలు తెలుపుతూ ట్వీట్స్ పెడుతున్నారు. ''#అఖండ భారీ ప్రారంభాన్ని పొందిందని వినడానికి చాలా సంతోషంగా ఉంది. నందమూరి బాలకృష్ణ గారికి, బోయపాటి శ్రీను గారు మరియు టీమ్ మొత్తానికి అభినందనలు'' అని మహేష్ బాబు ట్వీట్ చేశారు.

ప్రేక్షకుల్లో ‘అఖండ’ ఫీవర్‌ చూస్తుంటే ఆనందంగా ఉందని.. బాలకృష్ణ - బోయపాటి శ్రీనులకు హీరో రామ్ పొతినేని అభినందనలు తెలిపారు. ఈ సినిమా గురించి ఎన్నో అద్భుతమైన విషయాలు వింటున్నానని.. ఇండస్ట్రీకి మరలా రిలీజ్‌ డే ఎనర్జీని అందించిన బాలయ్య, బోయపాటికి ధన్యవాదాలు అని సందీప్ కిషన్ పేర్కొన్నారు.

'బాలకృష్ణ గారు గేట్లు ఓపెన్ చేశారు.. అఖండ టీమ్ కి కంగ్రాచ్యులేషన్స్' అని నాని ట్వీట్ చేశారు. ఇది మాస్‌ జాతర అని పేర్కొన్న డైరెక్టర్ గోపీచంద్‌ మలినేని.. #NBK 107కి సిద్ధంగా ఉండమని అన్నారు. వీరితోపాటు మంచు లక్ష్మి - రచయిత కోన వెంకట్ - యువ హీరో నిఖిల్ సిద్దార్థ - నటుడు బండ్ల గణేష్ - డైరెక్టర్ నందిని రెడ్డి తదితరులు 'అఖండ' చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు.