Begin typing your search above and press return to search.

లాక్ డౌన్ సమయంలో రాజమౌళి ఏం చేశారు?

By:  Tupaki Desk   |   4 Nov 2021 5:00 PM IST
లాక్ డౌన్ సమయంలో రాజమౌళి ఏం చేశారు?
X
సామాన్యులు మాన్యులు అనే తేడా ఎవ‌రికి ఉన్నా కోవిడ్ కి అలాంటి భేధాలేవీ లేవ‌ని ప్రూవైంది. మహమ్మారి అంద‌రికీ పాఠాలు నేర్పింది. లాక్ డౌన్ చాలా మంది మాన్యులు సెలబ్రిటీల జీవితాలను మార్చేసింది. ద‌ర్శ‌క‌దిగ్గ‌జం రాజమౌళి కూడా దీనికి మినహాయింపు కాదు. రాజమౌళి అతని కుటుంబ సభ్యులు గత సంవత్సరం మొదటి వేవ్ సమయంలో కరోనావైరస్ భారిన ప‌డిన సంగ‌తి తెలిసిందే.

మ‌హ‌మ్మారీ టెన్ష‌న్స్ గురించి చాలా కాలం త‌ర్వాత జ‌క్క‌న్న ఓపెన‌య్యారు. RRR ప్రమోషన్ లలో భాగంగా ప్రముఖ ఆంగ్ల దినపత్రికకు ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో రాజమౌళి కోవిడ్ సమయంలో తాను ఏం చేసారో లాక్ డౌన్ ను ఎలా గడిపాడో వెల్లడించాడు. మహమ్మారి ప్రారంభ రోజుల్లో తాను ఖాళీ స్క్రీన్ లాగా ఉన్నానని స్టార్ డైరెక్టర్ రాజ‌మౌళి వెల్లడించాడు. కానీ నేను ఎక్కువ‌ సేపు కుంగిపోలేదు. ప్రతి అంతరాయంలోనూ అవకాశం ఉంటుంది. నేను నా కుటుంబంతో గడిపాను. నా కెరీర్ గురించి ఆలోచంచాను. మూల్యాంకనం చేయడానికి ఇది నాకు గొప్ప అవకాశం క‌ల్పించింది`` అని తెలిపారు.

లాక్ డౌన్ తర్వాత సినిమా ట్రేడ్ పై రాజమౌళి చాలా ఆశలు పెట్టుకున్నాడు. థియేటర్లు తెరుచుకుంటున్నాయి. ఈ దీపావళికి ప్రజలు వచ్చి సినిమాలు చూడటానికి సిద్ధంగా ఉన్నారు అని దర్శకుడు ముగించారు. ఇక రాజ‌మౌళి తెర‌కెక్కించిన పాన్ ఇండియా చిత్రం ఆర్.ఆర్.ఆర్ వ‌చ్చే సంక్రాంతి కానుకగా విడుద‌ల‌వుతోంది. అప్ప‌టికి పాన్ ఇండియా రిలీజ్ ల‌కు ఎలాంటి ఆటంకం లేకుండా ప్ర‌తిదీ స‌జావుగా సాగుతుంద‌ని రాజ‌మౌళి ఆశిస్తున్నారు.