Begin typing your search above and press return to search.

పేరు పెట్టి పిలిచిన ఆ లేడీ డైరెక్టర్ ను మహేశ్ ఏమన్నారు?

By:  Tupaki Desk   |   9 May 2022 7:30 AM GMT
పేరు పెట్టి పిలిచిన ఆ లేడీ డైరెక్టర్ ను మహేశ్ ఏమన్నారు?
X
తెలుగు సినిమాకు సంబంధించి మహిళా దర్శకులన్నంతనే ఇప్పుడు గుర్తుకు వచ్చే దర్శకురాలు నందిని రెడ్డి. సినిమాను సరికొత్తగా చెప్పే ఆమె ప్రయత్నం సక్సెస్ కావటమే కాదు.. ఆమెకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నారు. ఆమె కెరీర్ ను చూస్తే ఎన్నో కష్టాలు.. సవాళ్లను ఎదుర్కొన్నారు. ఇప్పుడు ఆమె అనుభవిస్తున్న స్టార్ డం ఉత్తినే రాలేదు. దర్శకురాలిగా ఆమె ప్రతిభ ఎంత ఉన్నా.. వ్యక్తిగతంగా ఆమెకంటూ ఒక స్టెయిల్ ఉండటం.. అది మిగిలిన వారికి భిన్నంగా ఉండటం ప్రత్యేకంగా చెప్పాలి.

తాజాగా ఒక ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చిన నందినీ రెడ్డి ఆసక్తికర అంశాల్ని వెల్లడించారు. క్రిష్ణవంశీ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేస్తున్నప్పుడు ఆయన మురారి సినిమా చేస్తున్నారు. షూటింగ్ సమయంలో మహేశ్ షాట్ రెడీ అంటూ పేరు పెట్టి పిలిచారు. దీంతో అందరూ ఒక్కసారి అవాక్కు అయ్యారు. మహేశ్ కూడా ఆమెను అలా చూశారట. షూట్ అయ్యాక.. ‘మహేశ్ అంటున్నారేంటి?’ అన్నారు.

అందుకు ఆమె బదులిస్తూ.. ‘బాబూ.. బేబీ అనాలా?’ అని అనేస్తే.. ఆయన ఫక్కున నవ్వారట. ఆ తర్వాత నుంచి తనకు మహేశ్ మంచి స్నేహితుడయ్యాడని.. పెద్ద హీరో అనే ఆటిట్యూడ్ లేదని.. చాలా డౌన్ టూ ఎర్త్ అన్నట్లు ఉంటారని నందిని రెడ్డి పేర్కొన్నారు. మహేశ్ ను మాత్రమే కాదు.. ఇతర హీరోల్ని కూడా పేరు పెట్టే పిలుస్తారా? అంటే.. ఒక్కరు తప్పించి మిగిలిన వారిని పేర్లతోనే పిలుస్తానని ఆమె చెప్పటం విశేషం.

బన్నీ.. తారక్ లతో పాటు చాలామందిని పేర్లతోనే పిలుస్తానని.. ప్రభాస్ ను మాత్రం ప్రభాస్ గారు అంటానని చెప్పారు. తారక్ మాత్రం తనను అక్కా అంటారని.. బన్నీ హీరో కాక ముందు నుంచి తెలుసన్నారు. ప్రభాస్ మీద తనకు క్రష్ ఇప్పటికి ఎప్పటికి ఉంటుందన్నారు. ఆయన ఆల్ టైం ఫేవరెట్ అని.. ఆయన్ను చూస్తే మెస్మరైజ్ అయిపోతానని చెప్పారు. చక్రం మూవీ షూటింగ్ వేళలో ప్రభాస్ ను చూడటానికి వెళితే..దర్శకుడు వంశీ తనను చూసి.. అంత దూరం నుంచి చూసి సిగ్గు పడుతున్నావు..నీకు సిగ్గు సూట్ కాదన్నారన్న విషయాన్ని గుర్తు చేసుకున్నారు.




For Video >> https://twitter.com/VKrishna_V/status/1523372347239002112?s=20&t=Td7HNtdmuSeV08ryLgBqgQ https://twitter.com/VKrishna_V/status/1523372347239002112?ref_src=twsrc^tfw|twcamp^tweetembed|twterm^1523372347239002112|twgr^|twcon^s1_c10&ref_url=https://publish.twitter.com/?query=https3A2F2Ftwitter.com2FVKrishna_V2Fstatus2F1523372347239002112widget=Tweet