Begin typing your search above and press return to search.

వ్వాట్‌! మ‌గాళ్ల బాత్రూమ్ లోకి దీపిక‌-ఆలియా

By:  Tupaki Desk   |   31 Jan 2022 2:07 AM GMT
వ్వాట్‌! మ‌గాళ్ల బాత్రూమ్ లోకి దీపిక‌-ఆలియా
X
ఇటీవ‌ల ఆన్ స్క్రీన్ యాటిట్యూడ్ తో నిరంత‌రం చ‌ర్చ‌ల్లోకొస్తోంది దీపిక ప‌దుకొనే. గెహ్ర‌యాన్ లో కోస్టార్ సిద్ధాంత్ చ‌తుర్వేదితో ఘాటైన స‌న్నివేశాల్లో న‌టించిన దీపిక‌పై విమ‌ర్శ‌లు వెల్లువెత్తాయి. కానీ వాట‌న్నిటినీ దీపిక కానీ ర‌ణ‌వీర్ కానీ ప‌ట్టించుకోక‌పోగా దానిని ప్ర‌చారానికి స‌ద్వినియోగం చేస్తున్నారు.

ఈ ప్ర‌చారంలో దీపిక మ‌రింత టెంప్టింగ్ విష‌యాల్ని లీక్ చేస్తోంది. తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో తాను ఆలియాతో క‌లిసి మ‌గాళ్ల బాత్రూమ్ లోకి ప‌రిగెత్తాన‌ని చెప్పుకొచ్చింది. అవి డ‌ర్టీగా ఉన్నా కానీ త‌న‌కు అభ్యంత‌రం లేద‌ని కూడా చెప్పింది. ``ఆలియా నేను ఒక సంగీత కచేరీలో పురుషుల బాత్రూమ్ లోకి పరిగెత్తాము`` అని తెలిపింది. మహిళల బాత్రూమ్ వెలుపల లైన్ చాలా పొడవుగా ఉన్నందున తాను అలియా భట్ తో కలిసి పురుషుల బాత్రూంలోకి పరిగెత్తాను అని దీపికా పదుకొనే చెప్పింది. `కోల్డ్ ప్లే` సంగీత కచేరీలో ఈ ప‌రిస్థితి ఎదురైంద‌ని తెలిపింది.

అంతేకాదు త‌న‌కు పరిశుభ్రత పట్టింపు లేదుట‌. నేను `లూ..`ను ఉపయోగించాల్సి వచ్చినప్పుడు.. దానిని ఖచ్చితంగా ఎక్కడైనా ఉపయోగించాలి అని దీపిక అంది. ఇంతకుముందు కాఫీ విత్ కరణ్ కార్య‌క్ర‌మంలోనూ ఈ సంఘటనను వివరించింది. అనన్య - సిద్ధాంత్ లతో కలిసి దీపిక గెహ్రైయాన్ లో కనిపించనుంది. దీపిక ఇందులో క‌న్నింగ్ మెంటాలిటీ ఉన్న యువ‌తిగా క‌నిపించ‌నుంది. త‌న‌ ఎఫైర్ వ‌ల్ల అన‌న్య ఎంతో స్ట్ర‌గుల్ అవుతుంటుంది. ధైర్య కర్వా- నసీరుద్దీన్ షా- రజత్ కపూర్ కూడా నటించిన ఈ చిత్రం ఆధునిక సంబంధాల సంక్లిష్టతలపై తెర‌కెక్కింది. ఇటీవ‌ల విడుద‌లైన ట్రైల‌ర్ దూసుకెళ్లింది.