Begin typing your search above and press return to search.
నాని ఎదుర్కొన్న అవమానాలు ఏంటో..?
By: Tupaki Desk | 7 Sept 2020 9:30 AM ISTయంగ్ స్టార్ హీరో నాని తాజాగా 'వి' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. థియేటర్లు లేకపోవడంతో డైరెక్ట్ ఓటీటీ ద్వారా ఈ సినిమాను విడుదల చేశారు. నాని కెరీర్ లో 25వ సినిమా అయిన 'వి' కి నెగటివ్ టాక్ వచ్చింది. కాని నాని నటనకు మాత్రం మంచి మార్కలు పడుతున్నాయి. ఎప్పటి లాగే నాని సహజ నటనతో మెప్పించాడు అంటూ ప్రశంసలు కురుస్తున్నాయి. ఈసమయంలో నాని ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన కెరీర్ ఆరంభంలో ఎదుర్కన్న సమస్యల గురించి చెబుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
నాని మాట్లాడుతూ.. ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో చాలా అవమానాలు ఎదుర్కొన్నాను. అయినా కష్టం లేకుండా పైకి వస్తే కిక్ ఉండదు. కష్టాలు పడి పైకి వచ్చినప్పుడు మాత్రమే కిక్ ఉంటుంది. కష్టాలు పడ్డాను.. ఎంతో మంది అవమానించినా కూడా ఓర్చుకున్నాను. వాటన్నింటికి ప్రతిఫలం నాకు దక్కింది అంటూ నాని చెప్పుకొచ్చాడు. బ్యాక్ గ్రౌండ్ లేకుండానే నటుడు అయిన నాని ఎక్కువ కాలం ఉండక పోవచ్చు అనుకున్నారు. కాని తన ప్రతిభతో పోరాటం చేసి అవమానాలు భరిస్తూ కష్టపడి ఈస్థాయికి వచ్చాడు. ఎలాంటి అవమానాలు ఎదుర్కొన్న విషయాలను మాత్రం నాని వెళ్లడించలేదు. ప్రస్తుతం తనకు ఉన్నది ఏది కూడా ఈజీగా రాలేదని.. ఏదీ కూడా జీవితంలో ఈజీగా రాకూడదు అనేది తన పాలసీ అంటూ నాని పేర్కొన్నాడు.
'వి' తో వచ్చేసిన నాని ప్రస్తుతం టక్ జగదీష్ మరియు శ్యామ్ సింగరాయ సినిమాలతో రెడీ అవుతున్నాడు. ఈ రెండు సినిమాలు ఖచ్చితంగా థియేటర్ లలోనే విడుదల కాబోతున్నాయి. ఈ రెండు కాకుండా మరికొన్ని సినిమాలు కూడా చర్చల దశలో ఉన్నాయంటూ నాని పేర్కొన్నాడు. నాని ఏడాదికి రెండు మూడు సినిమాలు చేసుకుంటూ వెళ్తున్న నేథ్యంలో ఆయన 50వ సినిమా మైలు రాయిని కూడా త్వరలోనే చేరే అవకాశం ఉందనిపిస్తుంది.