Begin typing your search above and press return to search.

ఫొటోటాక్ : ఈ వయసులోనూ ఏమా వంపుసొంపులు

By:  Tupaki Desk   |   4 July 2021 6:30 AM GMT
ఫొటోటాక్ : ఈ వయసులోనూ ఏమా వంపుసొంపులు
X
బాలీవుడ్‌ ప్రేక్షకులతో పాటు సౌత్‌ ప్రేక్షకులకు ముఖ్యంగా తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితురాలు అయిన హాట్ ముద్దుగుమ్మ మలైకా అరోరా. ఈ అమ్మడు ఐటెం సాంగ్స్ కు ఒకప్పుడు కేరాఫ్‌ అడ్రస్ గా నిలిచింది. హీరోయిన్‌ గా కొన్ని ప్రయత్నాలు చేసినా కూడా హాట్ పాత్రలు మరియు ఐటెం సాంగ్స్ కే ఈమె పరిమితం అయ్యింది. ఐటెం సాంగ్స్ బ్రాండ్‌ అంబాసిడర్ గా మారిన ఈ అమ్మడు తెలుగు లో గబ్బర్‌ సింగ్ సినిమాలో చేసిన ఐటెం సాంగ్ ఎప్పటికి నిలిచి పోతుంది అనడంలో సందేహం లేదు. ఇక ఈ అమ్మడు నెట్టింట ఈమద్య కాలంలో చేస్తున్న సందడి అంతా ఇంతా కాదు.

సినిమాల్లో కనిపించక ఏళ్లు గడుస్తు ఉన్నా కూడా ఈ అమ్మడి క్రేజ్‌ ఏమాత్రం తగ్గలేదు. కారణం ఈమె వరుసగా హాట్ ఫొటోలు మరియు వీడియోలను షేర్‌ చేయడమే. ఇన్‌ స్టా గ్రామ్‌ లో 13 మిలియన్ ల మంది ఫాలోవర్స్ ను కలిగి ఉన్న ఈ అమ్మడు ఏ ఫొటో షేర్‌ చేసినా కూడా లక్షల్లో లైక్స్ ను సంపాదించుకుంటూ ఉంటుంది. తాజాగా ఈమె షేర్‌ చేసిన ఈ ఫొటోకు ఫాలోర్స్ ఫిదా అవుతున్నారు. కొన్ని గంటల్లోనే ఈమె ఈ ఫొటోకు మూడున్నర లక్షల మంది లైక్స్ చేశారు. ఈమె అందాన్ని ఆకాశానికి ఎత్తుతూ నెట్టింట కామెంట్స్ వెళ్లువెత్తుతున్నాయి.

ముఖ్యంగా పలువురు గూగుల్‌ లో మలైకా అరోరా వయసు తప్పు చూపిస్తుందా అంటూ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయిదు పదుల వయసుకు దగ్గర ఉన్నట్లుగా గూగుల్ చూపిస్తుంటే ఈ ఫొటోలో మాత్రం ఆమె మూడు పదుల వయ్యారిగా కనిపిస్తుందని అంటున్నారు. మరి కొందరు ఈ వయసులో కూడా ఏంటా పిజిక్‌.. ఏంటా వంపు సొంపులు అంటూ ఆమె అందంపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. అద్బుతమైన అందమైన ఒంపు సొంపులను కలిగి ఉన్న మలైకా ఇప్పటికి యంగ్ హీరోలకు మోస్ట్‌ వాంటెడ్ మరియు కుర్ర కారుకు గిల్లి కజ్జాలు పెట్టే బ్యూటీగా నిలుస్తుంది.