Begin typing your search above and press return to search.

ర‌కుల్ జోడీ ఒకే..మ‌రి ప్ర‌గ్యా జైశ్వాల్ సంగ‌తేంటి?

By:  Tupaki Desk   |   24 Aug 2022 12:30 AM GMT
ర‌కుల్ జోడీ ఒకే..మ‌రి ప్ర‌గ్యా జైశ్వాల్ సంగ‌తేంటి?
X
ర‌కుల్ ప్రీత్ సింగ్- జాకీ భ‌గ్నాని ప్రేమ వ్య‌వ‌హారం బ‌హిర్గ‌త‌మే. ముంబై మొత్తం జంట‌గా చుట్టేసిన సంద‌ర్భాలెన్నో. ఇక విదేశీ వెకేష‌న్ల గురించైతే చెప్పాల్సిన ప‌నిలేదు. ఖాళీ స‌మ‌యం చిక్కితే ప్లైట్ ఎక్కి షికారు చేయ‌డ‌మే. పెళ్లి కాకుండానే ప్రెండ్స్ పెళ్లిళ్లు అన్నింటిని జంట‌గా చుట్టేస్తున్నారు. ప‌నిలో ప‌నిగా అదే స‌మ‌యంలో అందుబాటులో ఉన్న ఫేమ‌స్ లొకేష‌న్ స్పాట్స్..దేవాల‌యాల్ని సైతం సంద‌ర్శిస్తున్నారు.

రకుల్ బాలీవుడ్ లో బిజీ అవుతోన్న నేప‌థ్యంలో మ‌కాం పూర్తిగా ముంబైకి మార్చేసింది. అన్ని యాక్టివిటీస్ ని అక్క‌డ నుంచే కొన‌సాగిస్తుంది. జాకీ అండ‌దండ‌లు ఉన్నాయి. దీంతో ర‌కుల్ కెరీర్ ని తెలివిగా ప్లాన్ చేసుకుంటుంది. తాజాగా ఈ జంట ప‌బ్ లో తీసుకున్న సెల్పీ ఒక‌టి నెట్టింట వైర‌ల్ గా మారింది. అందులో ర‌కుల్ ప‌క్కనే జాకీ క‌నిపిస్తున్నాడు. ఇది రొటీన్.

మ‌రోవైపు ప్ర‌గ్యా జైశ్వాల్ కూడా అక్క‌డే ఉంది. ఆమె ప‌క్క‌నే ఎవ‌రో కొత్త ప‌ర్స‌న్ క‌నిపిస్తున్నాడు. ఇంత వ‌ర‌కూ ప్ర‌గ్యా ఇలా క‌నిపించింది లేదు. స్నేహితుల‌తో సెల్పీలు దిగి ఇన్ స్టాలో పోస్ట్ చేసింది కూడా లేదు. తొలిసారి ఓ సెల్పీ వైర‌ల్ అవ్వ‌డంతో సందేహాలెన్నో. దీంతో నెటి జ‌నులు ఎవ‌రా? వ్య‌క్తి...ప్ర‌గ్యా ప్రియుడా? స్నేహితుడా? అంటూ అప్పుడే సందేహాలు వ్య‌క్తం చేస్తున్నారు.

ప్ర‌గ్యా ఇంత వ‌ర‌కూ ప్ర‌మ‌లో ప‌డింది లేదు. డేటింగ్ లు చేసింది లేదు. కెవ‌లం కెరీర్ పైనే ఫోక‌స్ పెట్టి ప‌నిచేసింది. అయితే ఇప్పుడు పెద్ద‌గా అవ‌కాలు లేక‌ ఖాళీగానే ఉంటుంది. చేసినంత కాలం ప్ర‌య‌త్న లోపం లేకుండా ట్రై చేసింది. టాలీవుడ్ లో క్రిష్-బాల‌య్య త‌ప్ప ఇంకెవ‌రూ ఎంక‌రేజ్ చేయ‌లేదు. బాలీవుడ్ లో అయితే ఛాన్సే లేదు.

స‌ల్మాన్ ఖాన్ లాంటి హీరో ప్రోత్స‌హిద్దాం..పైకి తీసుకొద్దామ‌ని ట్రై చేసాడు. కానీ అనివార్య కార‌ణాల వ‌ల్ల స‌ల్మాన్ సినిమా నుంచి మ‌ధ్య‌లోనే త‌ప్పుకోవాల్సి వ‌చ్చింది.

దానికి స‌ల్మాన్ బాధ్యుడు కాదండోయ్. కొన్ని వ్య‌క్తిగ‌త కార‌ణ‌ల‌తో ద‌ర్శ‌కుడు ఆ ప్రాజెక్ట్ నుంచి త‌ప్పించాడు. అందుకు ప్ర‌గ్య ఎంత‌గానే బాధ‌ప‌డింది కూడా. బాలీవుడ్ లో అమ్మ‌డి ప‌రిస్థితి ఇలా ఉంది.