Begin typing your search above and press return to search.

కిల్ల‌ర్ బేబీ ఏమిటిలా జ‌డ‌కు రిబ్బ‌ను చుట్టింది..!

By:  Tupaki Desk   |   6 Sep 2020 7:45 AM GMT
కిల్ల‌ర్ బేబీ ఏమిటిలా జ‌డ‌కు రిబ్బ‌ను చుట్టింది..!
X
కెరీర్ ఆరంభ‌మే ఓ రేంజు స్టార్ల‌తో జాక్ పాట్ కొట్టేసిన మ‌ల్లూ బ్యూటీ మాళ‌విక మోహ‌న‌న్. ర‌జ‌నీకాంత్ .. విజ‌య్ లాంటి స్టార్ల స‌ర‌స‌న న‌టించే ఛాన్స్ కొట్టేసింది. ఇండ‌స్ట్రీ సీనియ‌ర్ సినిమాటోగ్రాఫ‌ర్ వార‌సురాలిగా మాళ‌విక క్రేజు సౌత్ లో మామూలుగా లేదు. అయితే నాన్న కూచీగా ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టినా త‌న‌కంటూ ఫ్యాష‌న్ ఇండ‌స్ట్రీలో ఓ రేంజు ఉంద‌ని నిరూపించిన ఈ బ్యూటీ సినీ ఛాన్సుల‌తో పాటు.. వాణిజ్య ప్ర‌క‌ట‌న‌ల పరంగానూ క్రేజీ స్టార్ గా వెలిగిపోతోంది. మ‌ల‌యాళం టు త‌మిళం.. అట్నుంచి తెలుగు సినీప‌రిశ్ర‌మ‌కు ఈ అమ్మ‌డు చేస్తున్న ప్ర‌య‌త్నాలు మామూలుగా లేవ్.

టాలీవుడ్ లో రౌడీ స్టార్ విజ‌య్ దేవ‌ర‌కొండ‌ స‌ర‌సన `హీరో` చిత్రంలో అవ‌కాశం వ‌చ్చినా కొన్ని కార‌ణాల వ‌ల్ల ఆ మూవీ మిడిల్ డ్రాప్ అవ్వ‌డంపై ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగింది. ఆ త‌ర్వాత కూడా మాళ‌విక పేరును చ‌ర‌ణ్ .. బ‌న్ని రేంజు స్టార్లు ప‌రిశీలిస్తున్నారంటే సీక్వెన్స్ ఎలా ఉందో అర్థం చేసుకోవ‌చ్చు. త్వ‌ర‌లోనే మాళ‌విక నుంచి ఆ బిగ్ అనౌన్స్ మెంట్ రానుంద‌న్న గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉండ‌గానే ఈ అమ్మ‌డి లేటెస్ట్ ఫోటోషూట్ల‌పై కుర్ర‌కారులో ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది.

మొన్న‌టికి మొన్న ఓనం పండక్కి రెడ్ డిజైన‌ర్ శారీలో త‌ళుకుబెళుకులు ప్ర‌ద‌ర్శించిన ఈ మ‌ల్లూ బ్యూటీ కుర్ర‌కారు హృద‌యాల్ని దోచింది. తాజాగా ప్ర‌ఖ్యాత జేఎఫ్ డ‌బ్ల్యూ క‌వ‌ర్ పేజీపైనా కిల్లింగ్ లుక్ తో ద‌ర్శ‌న‌మిచ్చింది. వైట్ స్కూల్ యూనిఫాం.. జడకు రిబ్బ‌న్ చుట్టిన‌ సీత‌లా క‌నిపించినా కానీ.. మాళ‌విక అప్పియ‌రెన్స్ కి కాలేజ్ బోయ్స్ ప‌రేషాన్ అయిపోవాల్సిందే. మాళ‌విక స్ట‌న్నింగ్ ఫోటోషూట్స్ ఇన్ స్టాలో అందుబాటులో ఉండ‌డంతో యూత్ ఫాలో అప్ మామూలుగా లేదు. ప్ర‌స్తుతం జేఎఫ్ డబ్ల్యూ లుక్ వైర‌ల్ గా మారింది.