Begin typing your search above and press return to search.

గుర్రపు స్వారీ కోసం వెయిట్‌ తగ్గుతా : రేణు దేశాయ్‌

By:  Tupaki Desk   |   27 Sept 2020 4:00 PM IST
గుర్రపు స్వారీ కోసం వెయిట్‌ తగ్గుతా : రేణు దేశాయ్‌
X
రేణు దేశాయ్‌ సోషల్‌ మీడియాలో రెగ్యులర్‌ గా పోస్టు లు పెడుతూ ఉంటారు. ఆమె తన వ్యక్తిగత విషయాలు పిల్లలకు సంబంధించిన విషయాలను షేర్‌ చేస్తూ ఉంటారు. ఇటీవలే తాను నటిగా మళ్లీ కెమెరా ముందుకు వస్తున్నట్లుగా ప్రకటించింది. ఒక వెబ్‌ సిరీస్‌ లో ఆమె నటిస్తోంది. ఆ వెబ్‌ సిరీస్ కు సంబంధించిన పూర్తి వివరాలు అతి త్వరలో వెళ్లడి కానున్నాయి. ఇక తాజాగా రేణు తన జీవితంలో గుర్రాలు గుర్రపు స్వారీకి ఉన్న ప్రాముఖ్యతను పేర్కొన్నారు. మళ్లీ గుర్రపు స్వారీ చేసేందుకు వెయిట్‌ చేస్తున్నాను అంటూ ఆమె పేర్కొన్నారు.

ఇటీవల రేణు దేశాయ్‌ ఇన్‌ స్టాగ్రామ్‌ లో గుర్రంతో ఉన్న ఒక ఫొటోను షేర్‌ చేశారు. ఆ ఫొటోతో పాటు గుర్రాల్లో ఏదో తెలియని మ్యాజిక్‌ ఉంటుంది. నేను నా 12వ యేటనే గుర్రపు స్వారీని నేర్చుకున్నాను. గుర్రాలు చాలా తెలివైనవి అలాగే అవి చాలా చురుకుగా ఉంటాయి. అందువల్ల గుర్రపు స్వారీ అంటే నాకు చాలా ఇష్టం. 12 వ యేట నుండి 2015 వరకు నేను గుర్రపు స్వారీ చేసేదాన్ని. కాని 2015లో అనారోగ్యంతో బరువు పెరిగి పోయాను. అప్పటి నుండి గుర్రపు స్వారీ చేయలేదు. ప్రస్తుతం తాను గుర్రపు స్వారీ చేయడం కోసం బరువు తగ్గాలని ఎంతో కష్టపడుతున్నాను అంటూ రేణు దేశాయ్‌ పేర్కొన్నారు.