Begin typing your search above and press return to search.

#RRR : నవ్వుల ఆర్‌ఆర్‌ఆర్‌ ను స్పెషల్‌ గా రిలీజ్‌ చేస్తాం

By:  Tupaki Desk   |   20 March 2022 11:30 AM GMT
#RRR : నవ్వుల ఆర్‌ఆర్‌ఆర్‌ ను స్పెషల్‌ గా రిలీజ్‌ చేస్తాం
X
రాజమౌళి తెరకెక్కించిన అతి భారీ మల్టీ స్టారర్ మూవీ ఆర్ఆర్ఆర్ మరో నాలుగు రోజుల్లో విడుదలకు సిద్దంగా ఉంది. మార్చి 25న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతున్న ఈ సినిమా పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. అంచనాలు ఏమాత్రం తగ్గకుండా దర్శకుడు ఈ సినిమా ను తెరకెక్కించాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. అద్బుతమైన విజువల్ వండర్ గా ఈ సినిమాను రూపొందించారని ట్రైలర్‌ చెప్పకనే చెబుతోంది.

ఇక జక్కన్న ప్రతి సన్నివేశాన్ని కూడా నటీ నటులకు నటించి మరీ చూపిస్తాడు అనే టాక్ ఉంది. ఆ విషయం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే ఈసారి ఈ సినిమా కోసం జక్కన్న అసిస్టెంట్స్ లో ప్రతి సన్నివేశాన్ని కూడా మూడు నాలుగు వర్షన్ ల్లో నటించి మరీ ముందుగా ప్లాన్‌ చేశారట. అసిస్టెంట్స్ యాక్టింగ్ చేసిన సన్నివేశాలు అన్నింటిని కూడా రికార్డ్‌ చేశామని జక్కన్న పేర్కొన్నాడు.

ఈ సినిమా విడుదల అయిన తర్వాత తప్పకుండా ఆ మేకింగ్‌ వీడియోను విడుదల చేస్తాం. అది మరో ఆర్ ఆర్ ఆర్‌ సినిమా అవుతుంది అంటూ జక్కన్న సరదాగా చెప్పుకొచ్చాడు. ఆ మరో ఆర్‌ ఆర్‌ ఆర్‌ ప్రేక్షకులకు నవ్వులు పంచుతుందనే నమ్మకంను వ్యక్తం చేశారు. యూట్యూబ్‌ ద్వారా అతి త్వరలోనే ఈ మేకింగ్‌ వీడియోను విడుదల చేస్తామని జక్కన్న ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది.

దోస్తీ పాట విడుదల సమయంలోనే ఈ సినిమాకు సంబంధించిన మేకింగ్‌ వీడియో ను ఒక డాక్యుమెంటరీగా విడుదల చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నామని.. ప్రముఖ ఓటీటీ ఈ డాక్యుమెంటరీని తీసుకు రాబోతున్నట్లుగా ప్రచారం జరిగింది. డాక్యుమెంటరీని ఒక అందమైన వీడియో గా మల్చడంతో పాటు స్టార్స్ మరియు టెక్నికల్‌ టీమ్‌ మాట్లాడిన వీడియో లను కూడా అందులో ఉంచబోతున్నారు.

మొత్తానికి ఆర్ ఆర్‌ ఆర్‌ కు సంబంధిచిన ప్రతి విషయం కూడా ఒక అద్బుతం అనడంలో సందేహం లేదు. అలాంటి అద్బుతాలను ఈ సినిమా ను ఎన్నో చూపించబోతున్నారు. సినిమా విడుదల తర్వాత కూడా ఖచ్చితంగా ప్రతి ఒక్కరిని ఆకట్టుకునే విధంగా మేకింగ్ వీడియో లను విడుదల చేస్తామంటూ ప్రకటించారు.

జక్కన్న రాజమౌళి మరియు హీరోల ఇద్దరి కాంబో మేకింగ్‌ విజువల్స్‌ కోసం ప్రతి ఒక్కరు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.