Begin typing your search above and press return to search.

అతి పెద్ద సినిమా పండుగలో మనకు మళ్లీ నిరాశ

By:  Tupaki Desk   |   9 Feb 2022 4:30 AM GMT
అతి పెద్ద సినిమా పండుగలో మనకు మళ్లీ నిరాశ
X
ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేమికులు మరియు సినీ ప్రముఖులు ఎంతో ఆసక్తి చూపించే ఆస్కార్‌ నామినేషన్స్ లో ఈసారి కూడా మన సినిమాకు చోటు దక్కలేదు. సౌత్‌ ఇండియా నుండి ఈసారి ఖచ్చితంగా బెస్ట్‌ ఫారిన్ మూవీ కేటగిరీలో సూర్య నటించిన జై భీమ్ సినిమా ఉంటుందని ప్రతి ఒక్కరు భావించారు. అంతర్జాతీయ మీడియాలో కూడా జై భీమ్‌ గురించిన కథనాలు వచ్చాయి.

ప్రముఖ యూఎస్ మ్యాగజైన్‌ ఏకంగా జై భీమ్‌ నామినేషన్స్ లో నిలవడం ఖాయం.. ఆ సినిమా జాబితాలో టాప్ లో ఉందంటూ కథనంలో పేర్కొనడం జరిగింది. కాని అనూహ్యంగా జై భీమ్ సినిమాకు నిరాశ తప్పలేదు. ఆస్కార్ అవార్డు దక్కకున్నా కూడా మన సినిమాకు ఫైనల్‌ నామినేషన్‌ లో చోటు దక్కినా కూడా చాలా పెద్ద విషయం అని అంతా అనుకున్నారు.

ఫైనల్‌ నామినేషన్‌ జాబిత విడుదల నేపథ్యంలో దేశ వ్యాప్తంగా ముఖ్యంగా సౌత్‌ సినీ అభిమానులు చాలా ఉత్కంఠతతో ఎదురు చూశారు. ముందస్తు సంబరాలకు సిద్దం అయ్యారు. మీడియాలో జై భీమ్‌ సినిమా నామినేషన్‌ లో చోటు దక్కించుకున్నట్లుగానే కథనాలు రాస్తూ వచ్చారు. కాని చివరకు నామినేషన్స్‌ విడుదల అయిన తర్వాత జై భీమ్ ప్రేక్షకులకు అభిమానులకు నిరాశ తప్పలేదు.

జై భీమ్‌ సినిమా స్వల్ప తేడాతోనే ఆ అవకాశం ను చేజార్చుకున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. తేడా ఎంత అయినా కూడా అవకాశం అయితే చేయి జారింది. మరోసారి అతి పెద్ద సినిమా పండుగ అయిన ఆస్కార్ హంగామాలో మన సినిమాకు చోటు దక్కలేదు అంటూ అభిమానులు నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నారు.

ఫైనల్‌ నామినేషన్‌ లో పది సినిమాలను ఎంపిక చేయడం జరుగుతుంది. కనుక ఆ పది సినిమాల్లో ఒక సినిమా గా జై భీమ్ ఉండటం లో అనుమానం లేదు అన్నట్లుగా ఇండియన్ సినీ అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేశారు. సినిమాలోని కంటెంట్ మరియు నటీ నటుల నటన చాలా సహజంగా అద్బుతంగా ఉండటంతో ఆస్కార్‌ టీమ్ దృష్టిని ఆకర్షిస్తుందని అనుకున్నారు.

కాని అంతకు మించిన సినిమాలు అక్కడ ఉండటంతో జై భీమ్ సినిమాకు ఎప్పటిలాగే నిరాశే మిగిలింది. ఆస్కార్ అవార్డు ఏమో కాని కనీసం ఇండియన్ సినిమాలు ఆస్కార్ నామినేషన్స్ ను దక్కించుకోలేక పోతున్నాయి అనే విమర్శలు వస్తున్నాయి. ప్రతి సంవత్సరం వేల కొద్ది సినిమాలను నిర్మించే ఇండియన్ సినీ పరిశ్రమ నుండి ఒక్క ఆస్కార్ అవార్డు ఎంట్రీ దక్కక పోవడం విడ్డూరం లగాన్ కు ఆస్కార్‌ ఎంట్రీ దక్కింది. మళ్లీ అప్పటి నుండి ఇప్పటి వరకు ఏ సినిమాకు కూడా అలాంటి ఘనత దక్కలేదు. ముందు ముందు అయినా నామినేషన్‌.. ఆస్కార్‌ లు మన ఇండియన్ సినిమాకు దక్కుతాయేమో చూడాలి.