Begin typing your search above and press return to search.
‘ఒక్కడు’లో ఆ హీరోనే అనుకున్నాం..మహేష్ కృష్ణ గారి సన్ కావడం వల్లే.. చాలా రిస్క్
By: Tupaki Desk | 29 Dec 2020 7:00 AM ISTమహేష్ బాబు కెరీర్ లో మొట్టమొదటి బ్లాక్ బస్టర్ మూవీ ‘ఒక్కడు’. ఎలాంటి అంచనాల్లేకుండా రిలీజైన ఈ మూవీ.. ఇండస్ట్రీలో అప్పటివరకు ఉన్న గత రికార్డులను తుడిచిపారేసింది. గుణశేఖర్ దర్శకత్వంలో MS రాజు నిర్మించిన ఈ మూవీ ఇండస్ట్రీ చూపును తనవైపు తిప్పుకుంది. 2003లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆ సినిమా గురించి లేటెస్ట్ గా మాట్లాడారు ప్రొడ్యూసర్. మహేష్ ను హీరోగా సెలక్ట్ చేసుకోవడానికి గల రీజన్స్ కూడా వివరించారు.
సమంత్ ఆర్ట్ ప్రొడక్షన్ అంటే అప్పట్లో ఒక సక్సెస్ ఫుల్ బ్యానర్. సూపర్బ్ జడ్జిమెంట్ ఇచ్చే నిర్మాతగా పేరుండేది MS రాజుకి. వెంకటేష్ ‘శత్రువు’ సినిమాతో ఇండస్ట్రీలో అడుగు పెట్టిన రాజు.. ఆ తర్వాత ఎన్నో మంచి సినిమాలు అందించారు. పోలీస్ లాకప్, స్ట్రీట్ ఫైటర్, దేవి, దేవిపుత్రుడు, మనసంతా నువ్వే, నువ్వొస్తానంటే నేనొద్దంటానా? వంటి సూపర్ట్ హిట్స్ సుమంత్ ప్రొడక్షన్స్ నుంచి వచ్చినవే. 2003లో ‘ఒక్కడు’ సినిమాతో ఇండస్ట్రీ హిట్ అందుకొని నిర్మాతగా తన స్థాయిని పెంచుకున్నారు ఎమ్ఎస్.రాజు. ఆ తర్వాత చిత్ర నిర్మాణానికి దూరమైన రాజు.. ఆ తర్వాత డైరెక్టర్ గా మారారు. లేటస్ట్ గా ‘డర్టీ హరి’ అనే సినిమాను తెరకెక్కించారు. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో ఆయన ‘ఒక్కడు’ సినిమా గురించి మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే..
‘ఒక్కడు’ మూవీలో మొదట వేరే హీరోలను అనుకున్నట్లు అప్పట్లో ఎన్నో రకాల రూమర్స్ వచ్చాయి. కానీ నిజానికి మహేష్ బాబును తప్పితే మరొక హీరోను అనుకోలేదు. దర్శకుడు గుణశేఖర్ కూడా మహేష్ బాబును దృష్టిలో ఉంచుకొనే కథను అద్భుతంగా తయారు చేశారు. దానికి అనుగుణంగానే తెరకెక్కించారు.
ఈ మూవీ షూటింగ్ దశలో ఉండగానే బాక్సాఫీస్ హిట్ గా నిలుస్తుందని అందరికీ ఒక నమ్మకం వచ్చేసింది. ఇక, ఈ సినిమాలో హీరోగా మహేష్ బాబును తీసుకోవటానికి కారణం.. ఆయన కృష్ణ గారి కొడుకు అవ్వడం వలనే. నిజానికి కొత్త వారిని పెట్టి తీస్తే అంత కిక్కు ఉండదు అనిపించింది.
కొండారెడ్డి బురుజు సీన్ లో మహేష్ అలా నడుచుకుంటూ వస్తుంటే నాకైతే సూపర్ స్టార్ కృష్ణ గారు కనిపించారు. మహేష్ ఆ సినిమా చేశాడు కాబట్టే అంత పెద్ద హిట్ అయ్యింది. వేరే చిన్న హీరోనో.. లేదంటే కొత్త హీరోని పెట్టుకొని ఉంటే అంత పెద్ద స్థాయిలో సినిమా విజయం సాధించి ఉండేది కాదు.
ఇక బడ్జెట్ విషయంలోనైతే చాలా రిస్క్ చేశాం. కానీ.. ధైర్యంగా ముందుకెళ్లాం. రామానాయుడు గారికి చెందిన ఒక స్థలంలో ఒక్కడు సినిమా కోసం చార్మినార్ సెట్ వేయడం జరిగింది. అయితే.. సెట్ వేసిన తర్వాత మొత్తం కూలిపోయింది. దీంతో.. మళ్ళీ నిర్మించాం. సినిమా మీద నమ్మకంతో ఖర్చు విషయంలో ఎక్కడా రాజీపడకుండా నిర్మించాం. అందువల్లే మంచి విజయం దక్కింది.