Begin typing your search above and press return to search.

బయోపిక్ కి బయపడుతున్న నాగ్

By:  Tupaki Desk   |   24 Jan 2019 3:01 PM IST
బయోపిక్ కి బయపడుతున్న నాగ్
X
ఎన్టీఆర్ కథానాయకుడు ఫలితం బయోపిక్ లు తీసి సొమ్ములు చేసుకోవాలి అనుకుంటున్న వాళ్ళకు వార్నింగ్ బెల్ గా మారిపోయింది. అంతటి మహానటుడి కథను చూపిస్తేనే జనం ఒప్పుకోలేదు. ఫలితంగా 50 కోట్ల నష్టంతో టాప్ 3 డిజాస్టర్స్ లో చేరిపోయింది. నిజానికి ఇంత దారుణ పరాజయం ఎవరూ ఊహించలేదు. యావరేజ్ అయినా ఎంతో కొంత పరువు నిలిచేది కాని ఆ స్థాయి సైతం అందుకోలేకపోయింది. నష్టం చూసుకుని బయ్యర్లు ఇప్పటికే ఘొల్లుమంటున్నారు. ఇదలా ఉంచితే ఇదే తరహాలో అక్కినేని నాగేశ్వర్ రావు బయోపిక్ రూపొందుతుందా అనే టాక్ కూడా బయటికి వచ్చింది.

సుమంత్ ఎలాగూ ఆ లుక్స్ లో పర్ఫెక్ట్ గా సెట్ అయ్యాడు కాబట్టి తీసినా బాగుంటుందనుకున్నారు ఫ్యాన్స్. అయితే నాగ్ మనసులో ఏ కోశానా బయోపిక్ ఆలోచన ఉన్నట్టు కనిపించడం లేదు. మిస్టర్ మజ్ను ప్రమోషన్ లో భాగంతో అఖిల్ తో కలిసి ఇచ్చిన ఇంటర్వ్యూలో అదే చెబుతున్నాడు. నాన్న సినిమాలు రీమేక్ చేసేందుకే ధైర్యం సరిపోని తమకు బయోపిక్ తీసే సత్తా ఉందని అనుకోవడం లేదని పుకార్లకు చెక్ పెట్టేసాడు. పైగా ఎన్టీఆర్ తరహలోనే ఏఎన్ఆర్ కెరీర్ లోనూ పెద్దగా డ్రామా ఉండదు.

ఇంకా చెప్పాలంటే ఏఎన్ ఆర్ రాజకీయాల్లోకి ప్రవేశించలేదు కాబట్టి ఇంకా సాఫీగా సాగిపోయింది. సో ఒకవేళ తీయాలి అనుకున్నా కథానాయకుడు తరహాలో పాత పాటల బిట్లు పదే పదే చూపించుకోవాలి. అందుకే నాగ్ ఇవన్ని ఆలోచించే అనవసరంగా రిస్క్ ఎందుకు చేయడం అని డ్రాప్ అయినట్టు ఉన్నాడు. పైగా బాలకృష్ణ చేస్తేనే చూడలేదు అంటే మార్కెట్ లేని సుమంత్ తో తీస్తే బిజినెస్ పరంగా ఇబ్బంది. మొత్తానికి గొప్ప స్టార్లను ఆషామాషీగా చూపితే జనం ఒప్పుకోరని ప్రేక్షకులు సుస్పష్టంగా తీర్పిచ్సిన నేపధ్యంలో ఇకపై బయోపిక్ అంటే ఎవరైనా ఒకటికి రెండుసార్లు ఆలోచించాల్సిందే