Begin typing your search above and press return to search.
మోహన్ బాబు వెంట నడవడానికి సిద్ధంగా ఉన్నాం..!
By: Tupaki Desk | 3 Jan 2022 6:00 PM ISTతెలుగు చిత్ర పరిశ్రమలోని సమస్యలపై గత కొంతకాలంగా చర్చలు జరుగుతున్నాయి. ఇటీవల ఆంధ్రప్రదేశ్ లో టికెట్ ధరలు నియంత్రిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం హాట్ టాపిక్ గా మారింది. దీనిపై పలువురు సినీ ప్రముఖులు కామెంట్స్ చేయడం.. టికెట్ రేట్ల అంశం మీద కొందరు ఎగ్జిబిటర్స్ కోర్టుకు వెళ్లడం వంటివి ఇండస్ట్రీకి ప్రభుత్వానికి మధ్య గ్యాప్ ఉందని అనుకునే విధంగా మారాయి.
ఈ నేపథ్యంలో టాలీవుడ్ సీనియర్ నటుడు, నిర్మాత మంచు మోహన్ బాబు టాలీవుడ్ లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులపై స్పందిస్తూ బహిరంగ లేఖ విడుదల చేసిన సంగతి తెలిసిందే. సినిమా ఇండస్ట్రీ అంటే నలుగురు హీరోలు, నలుగురు ప్రొడ్యూసర్స్, నలుగురు డిస్టిబ్యూటర్స్ కాదని.. కొన్ని వేలమంది ఆశలు - కొన్ని వేల కుటుంబాలు - కొన్ని వేల జీవితాలని అన్నారు.
చిత్ర పరిశ్రమలోని వారందరూ కూర్చొని సమస్యలపై మాట్లాడుకోవాలని.. ఆ తర్వాత మంత్రులను, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులను కలవాలని మోహన్ బాబు హితవు పలికారు. సినిమా పరిశ్రమకు నిర్మాతలే దేవుళ్ళని.. కానీ ఈ రోజున ఆ నిర్మాతలు ఏమయ్యారని విలక్షణ నటుడు ప్రశ్నించారు. అసలు ప్రొడ్యూసర్ కౌన్సిల్ సమస్యను భుజాల మీద వేసుకోకుండా.. ఎవరికి వారే యమునాతీరే అన్నట్టు ఎందుకు మౌనం వహిస్తుందో అర్ధం కావట్లేదని అన్నారు.
అందరం కలిసి ఒక్కటిగా ఉంటేనే సినిమా బ్రతుకుతుందని.. రండి ఇండస్ట్రీలోని సమస్యలను పరిష్కరించుకుందామని మోహన్ బాబు పిలుపునిచ్చారు. అయితే మోహన్ బాబు వ్యాఖ్యలపై నిర్మాతల మండలి అధ్యక్షుడు సి. కల్యాణ్ స్పందించారు. ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ అన్ని సమస్యలపై ప్రభుత్వాలతో చర్చిస్తూనే ఉందని అన్నారు. మోహన్ బాబు ఫ్యామిలీ అంతా సినిమా రంగంలోనే ఉందని.. ఆయన వెంట నడవడానికి తాము సిద్ధంగా ఉన్నామని కళ్యాణ్ తెలిపారు.
నిర్మాతల్లో ఐక్యత లేనందునే ఇలాంటి సమస్యలు వస్తున్నాయని.. సమస్యల పరిష్కారం కోసం ఎవరు ముందుకొచ్చినా అది ఇండస్ట్రీ కోసమేనని అభిప్రాయపడ్డారు. ఆ పని మోహన్ బాబు చేస్తానంటే.., తాము ఆయనతో పాటు ఉంటామని సి కళ్యాణ్ అన్నారు. ఈ సందర్భంగా ఏపీలో సమస్యల గురించి మాట్లాడుతూ ఘాటు వ్యాఖ్యలు చేసారు.
సినిమా ఆదాయంలో 52 శాతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండే వస్తుందని.. కానీ ఏపీకి కనీసం రూపాయి అయినా టాక్స్ కడుతున్నామా? అని సి కళ్యాణ్ ప్రశ్నించారు. అలాంటప్పుడు ఏపీ ప్రభుత్వానికి ఇండస్ట్రీ మీద ప్రేమ ఎందుకు ఉంటుందని నిర్మాత వ్యాఖ్యానించారు. మరి దీనిపై ఇతర సినీ ప్రముఖులు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.