Begin typing your search above and press return to search.

వ్వాటే బ్యూటీ.. ఇన్ కం ట్యాక్స్ రైడైపోద్దే!

By:  Tupaki Desk   |   3 Feb 2020 4:48 AM GMT
వ్వాటే బ్యూటీ.. ఇన్ కం ట్యాక్స్ రైడైపోద్దే!
X
నితిన్ క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్న సినిమా భీష్మ‌. ర‌ష్మిక మంద‌న క‌థానాయిక‌. వెంకీ కుడుముల ద‌ర్శ‌కుడు. సితార ఎంట‌ర్ టైన్ మెంట్స్ సంస్థ నిర్మిస్తోంది. మ‌హ‌తి స్వ‌ర సాగ‌ర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఈనెల 21న సినిమా ప్ర‌పంచ‌వ్యాప్తంగా థియేట‌ర్ల‌లోకి రిలీజ‌వుతోంది. ఈ సంద‌ర్భంగా ప్ర‌చారంలో వేగం పెంచిన చిత్ర‌బృందం ఇప్ప‌టికే ప‌లు పోస్ట‌ర్ల‌ను రిలీజ్ చేసి ఆక‌ట్టుకున్న సంగ‌తి తెలిసిందే.

పోస్ట‌ర్లు.. లిరికల్ వీడియోల‌తో గ్యాప్ అన్న‌దే లేకుండా టీమ్ ప్ర‌చారం చేస్తోంది. తాజాగా వ్వాటే బ్యూటీ లిరిక‌ల్ వీడియో రిలీజైంది. ఈ వీడియో ఆద్యంతం సాంగ్ మేకింగ్ కి సంబంధించిన ఇంట్రెస్టింగ్ విజువ‌ల్స్ ని చిత్ర‌బృందం రిలీజ్ చేసింది. వ్వాటే బ్యూటీ కోసం నితిన్ - ర‌ష్మిక జోడీ ఎంత‌గా ఇన్వాల్వ్ అయ్యిందో ఈ వీడియో చూస్తేనే అర్థ‌మ‌వుతోంది. కాస‌ర్ల శ్యామ్ రాసిన లిరిక్ ఆద్యంతం రైమ్ అండ్ రిథ‌మ్ తో ఆక‌ట్టుకుంటోంది. ఇక మ‌హ‌తి సాగ‌ర్ మాస్ బీట్ గొప్ప ఊపు తెచ్చింద‌నే చెప్పాలి. ధ‌నుంజ‌య్- అమ‌లా చేబోలు గానం వాటే బ్యూటీకి ఎంతో పెప్పీగా జూసీగా కుదిరింది. సాంగ్ ఆద్యంతం నితిన్ ఎన‌ర్జిటిక్ డ్యాన్సులు.. ర‌ష్మిక ఎక్స్ ప్రెష‌న్స్ ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలిచాయి. ఇక ఈ పాట‌లో వ్వాటే బ్యూటీ.. ఇన్ కం ట్యాక్స్ రైడైపోద్దే! అంటూ ఆ ప‌ద‌ప్ర‌యోగం యాధృచ్ఛిక‌మే అయినా ర‌ష్మిక‌ పై ఐటీ దాడులు టాపిక్ ని గుర్తు చేసిన‌ట్టే అనిపించింది. సినీసెల‌బ్రిటీల బ‌ర్నింగ్ ఇష్యూని కాస‌ర్ల శ్యాం ట‌చ్ చేయ‌డం ఆస‌క్తిక‌రం.

ఇక ఈ సినిమాలో ర‌ష్మిక అందాల ట్రీట్ ఓ లెవ‌ల్లో ఉంటుంద‌ని ఇప్ప‌టికే ప్ర‌మోష‌న‌ల్ మెటీరియల్ చెబుతోంది. ర‌ష్మిక గ్లామ‌ర్ ని భీష్మ ఓ రేంజులోనే స‌ద్వినియోగం చేసుకుంటున్నార‌న్న కామెంట్ వినిపిస్తోంది. ఈ సినిమా నుంచి మ‌రిన్ని లిరిక‌ల్ వీడియోలు మునుముందు రిలీజ్ కానున్నాయి. మూవీ రిలీజ్ కి కేవ‌లం మ‌రో రెండు వారాలే స‌మ‌యం ఉంది కాబ‌ట్టి భీష్మ టీమ్ మ‌రింత స్పీడ్ పెంచుతుందేమో చూడాలి. ఇక సోష‌ల్ మీడియా ప్ర‌మోష‌న్ తో స‌రిపెట్టుకోకుండా ఇన్నోవేటివ్ గా ప్ర‌మోష‌న్ ఏం చేస్తారు? అన్న‌ది ఇంపార్టెంట్. నితిన్ - వెంకీ కుడుముల‌కు ఇది కీల‌క‌మైన ఎటెంప్ట్. ఇప్ప‌టికే క్రియేటైన బ‌జ్ ని మ‌రింత రెట్టింపు చేయాలంటే ప్ర‌చార సామాగ్రిలో ప‌దునైన అస్త్రాల్ని సంధించాల్సి ఉంటుందేమో!!