Begin typing your search above and press return to search.

వీడియో : హాట్‌ బ్యూటీ కష్టం కు వావ్‌ అనాల్సిందే

By:  Tupaki Desk   |   13 Dec 2019 11:59 AM IST
వీడియో : హాట్‌ బ్యూటీ కష్టం కు వావ్‌ అనాల్సిందే
X
వెండి తెర పై హీరోలైనా హీరోయిన్స్‌ అయినా అందంగా స్లిమ్‌ గా ఆకర్షనీయంగా కనిపించాలి అంటే తెర వెనుక చాలా కష్టపడాల్సి ఉంటుంది. కేవలం షూటింగ్స్‌ సమయంలో మాత్రమే కష్టపడకుండా జిమ్‌ లో కూడా స్టార్స్‌ చాలా కష్టపడుతూ ఉంటారు. రోజులో కనీసం రెండు నుండి అయిదు గంటలు కష్టపడే వారు చాలా మంది ఉంటారు. హీరోలు మాత్రమే కాకుండా హీరోయిన్స్‌ కూడా జిమ్‌ లో గంటల తరబడి వర్కౌట్స్‌ చేస్తూనే ఉంటారు.

స్టార్‌ హీరోయిన్స్‌ లో దాదాపు అంతా కూడా జిమ్‌ లో చాలా కష్టపడుతూ ఉంటారు. కాని అందరిలోకి రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ ఇంకాస్త ఎక్కువ కష్టపడుతుందేమో అనిపిస్తుంది. ఫిట్‌ నెస్‌ పై ఆమెకు చాలా శ్రద్ద ఉంటుంది. రెగ్యులర్‌ గా ఆమె జిమ్‌ చేస్తుంది. జిమ్‌ సెంటర్‌ ను కూడా ఆమె నిర్వహిస్తున్న విషయం తెల్సిందే. రకుల్‌ వర్కౌట్‌ వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతుంది. ఫిట్‌ గా ఉండేందుకు మరీ ఇంతగా కష్టపడతారా అంటూ అంతా ఆశ్చర్య పోతున్నారు.

వీడియోలో రకుల్‌ వర్కౌట్స్‌ సాదారణంగా అబ్బాయిలు చేసేందుకు చాలా కష్టపడాల్సి ఉంటుంది. అలాంటిది రకుల్‌ అలవోకగా చేసేసింది. ఇంతగా కష్టపడుతుంది కనుక ఇంత ఫిట్‌ గా అందంగా ఉందేమో అంటూ నెటిజన్స్‌ కామెంట్స్‌ చేస్తున్నారు.

వీడియో కోసం క్లిక్ చేయండి