Begin typing your search above and press return to search.

హీరోగాను యార్క‌ర్ విసురుతున్న వ‌సీం అక్ర‌మ్

By:  Tupaki Desk   |   7 Sep 2022 2:30 PM GMT
హీరోగాను యార్క‌ర్ విసురుతున్న వ‌సీం అక్ర‌మ్
X
పాక్ మాజీ ఫాస్ట్ బౌల‌ర్ వ‌సీం అక్ర‌మ్ గురించి క్రికెట్ ప్రియుల‌కు పరిచ‌యం అవ‌స‌రం లేదు. స‌మ‌కాలీన క్రికెట‌ర్ల‌లో వ‌సీం బెస్ట్ యార్క‌ర్ బౌల‌ర్ గా కూడా పాపుల‌ర‌య్యారు. ప్ర‌పంచంలోనే అత్యుత్త‌మ ట్రాక్ రికార్డ్ క‌లిగిన బౌల‌ర్ గా అత‌డి పేరు రికార్డుల్లో నిలిచి ఉంది.

ప్ర‌స్తుతం అత‌డు సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. పాకిస్థానీ నటుడు ఫవాద్ ఖాన్ తో క‌లిసి ఓ సినిమాకి సంతకం చేసారు. మార్వెల్ సిరీస్ Ms. మార్వెల్ లో ప్రత్యేక పాత్ర‌తో అల‌రించిన ఫ‌వాద్ తో క‌లిసి న‌టించ‌నున్న అక్ర‌మ్ పేరు ట్రెండింగ్ లో నిలుస్తోంది.ఈ ప్రాజెక్ట్ కు 'మనీ బ్యాక్ గ్యారెంటీడ్‌' అనే టైటిల్ ను ప్రకటించారు. మంగళవారం తొలి పోస్టర్ ను ఆవిష్కరించారు.

తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్టర్ ను షేర్ చేస్తూ మా తదుపరి చిత్రం 'మనీ బ్యాక్ గ్యారెంటీ - MBG' చ‌క్కని కాన్సెప్ట్ భారీ బ‌డ్జెట్ తో తెర‌కెక్కుతోంద‌ని తెలిపారు. ఫవాద్ ఖాన్- వసీం అక్రమ్- షానీరా అక్రమ్- మికాల్ జుల్ఫికర్- అయేషా ఒమర్- జావేద్ షేక్- జాన్ రాంబో- గోహర్ రషీద్- హీనా దిల్పజీర్- షాయన్ ఖాన్- మణి- కిరణ్ మాలిక్- అలీ సఫీనా- మర్హూమ్ అహ్మద్ బిలాల్- అద్నాన్ జాఫర్ - ఎ షక్దాత్స్ త‌దిత‌రులు ఈ చిత్రంలో న‌టిస్తున్నారు. ఈ చిత్రానికి ఫైసల్ ఖురేషి దర్శకత్వం వహించారు. 9 సెప్టెంబర్ 2022న టీజ‌ర్ విడుద‌ల‌వుతుంది. 21 ఏప్రిల్ 2023న థియేటర్లలోకి విడుద‌ల కానుంది.

మహీరాఖాన్ ప్ర‌ధాన పాత్ర‌లో నటించిన పాకిస్థానీ చిత్రం 'ది లెజెండ్ ఆఫ్ మౌలా జట్‌'తో ఫవాద్ ఖాన్ ఇటీవ‌ల మీడియా హెడ్ లైన్స్ లో నిలుస్తున్నారు. ఈ చిత్రం అక్టోబర్ 13న థియేటర్లలోకి రానుంది. ఫవాద్ మౌలా జట్ గా... మహిరా ముఖోగా నటించారు. పంజాబీ-భాషా చిత్రం 1979 క్లాసిక్ మౌలా జట్ కి రీమేక్. ఇందులో హంజా అలీ అబ్బాసీ కూడా ఓ ముఖ్య పాత్ర‌లో నటించారు.

క్రికెట‌ర్లు సినిమాల్లో ఎంట్రీ ఇవ్వ‌డం ఇదే తొలిసారి కాదు. ఇంత‌కుముందు గ‌వాస్క‌ర్ బాలీవుడ్ లో ఓ అతిథి పాత్ర‌లో న‌టించారు. అలాగే హిట్ట‌ర్ అజ‌య్ జ‌డేజా హీరోగా న‌టించేందుకు స‌న్నాహాలు చేసారు. అందులో న‌గ్మ హీరోయిన్ అని కూడా ప్ర‌క‌టించారు. కానీ అది ఎందుక‌నో కుద‌ర‌లేదు.

కానీ జ‌డేజా ఆ త‌ర్వాత‌ అతిథి పాత్ర‌లో న‌టించాడు. వివాదాస్ప‌ద క్రికెట‌ర్ గా ట్రెండింగ్ అయిన శ్రీ‌శాంత్ క్రికెట్ కి గుడ్ బాయ్ చెప్పి సినిమాల్లో హీరోగా ఎంట్రీ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. అత‌డు మంచి డ్యాన్స‌ర్ గానూ గుర్తింపు తెచ్చుకున్నాడు. హార్డీ సంధు- స‌లీల్ ఆంకోలా- క‌ర‌ణ్ వాహీ త‌దిత‌రులు న‌టులుగా రాణించారు. ఇప్పుడు పాక్ క్రికెట‌ర్ వ‌సీం అక్ర‌మ్ పూర్తి నిడివి సినిమాల్లో న‌టిస్తుండ‌డం ఆస‌క్తిక‌రం.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.