Begin typing your search above and press return to search.

అమితాబ్ ఎందుకు ఆ ట్వీట్ చేశారు?

By:  Tupaki Desk   |   25 Feb 2018 12:12 PM IST
అమితాబ్ ఎందుకు ఆ ట్వీట్ చేశారు?
X
శ్రీదేవి హఠాన్మరణంతో కోట్లాది మంది ఆమె అభిమానులు షాక్ లో ఉన్నారు. ఆ విషయాన్ని ఇంకా కూడా జీర్ణించుకోలేకపోతున్న వాళ్లు ఎందరో? కేవలం సామాన్య అభిమానుల్లోనూ కాదు.. ఫిలిం సెలబ్రెటీల్లోనూ శ్రీదేవికి వీరాభిమానులెందరో? వాళ్లందరికీ శ్రీదేవి మరణం పెద్ద షాకే. ఐతే శ్రీదేవికి అత్యంత సన్నిహితుల్లో ఒకరైన బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ కు శ్రీదేవి మరణం గురించి వెంటనే తెలిసిందా.. లేక ఆయన సిక్స్త్ సెన్స్ ఏమైనా సంకేతాలు అందించిందా అని ఆశ్చర్యపోతున్నారు జనాలిప్పుడు. నిన్న అర్ధరాత్రి అమితాబ్ చేసిన ఒక ట్వీటే అందుకు కారణం.

ఎందుకో తెలియదు.. కొంచెం అలజడిగా ఉందంటూ అమితాబ్ నిన్నఅర్ధరాత్రి ట్వీట్ చేశారు. కాసేపటికే శ్రీదేవి మరణ వార్త బయటికి వచ్చింది. మరి అబితాబ్ ఈ ట్వీట్ ఎందుకు చేశారో అన్న చర్చ మొదలైందిప్పుడు. శ్రీదేవితో ఐదు సినిమాల్లో నటించారు అమితాబ్. ఆమె కుటుంబంతో బిగ్-బికి మంచి సంబంధాలున్నాయి. ఈ నేపథ్యంలో ఆమె చనిపోయిన వెంటనే బిగ్-బికి సమాచారం అందించి ఉండొచ్చని.. వెంటనే విషయం చెప్పి అభిమానుల్ని విస్మయానికి గురి చేయడం ఇష్టం లేక అమితాబ్ ఆ ట్వీట్ పెట్టి ఉండొచ్చని కొందరు.. లేదు లేదు బిగ్-బికి సిక్స్త్ సెన్స్ సంకేతాలివ్వడం వల్లే ఆయన ఆ మేరకు ట్వీట్ పెట్టారు అని మరికొందరు అంటున్నారు. అసలు విషయం ఏంటో చెప్పమని ఎంతమంది అడుగుతున్నా అమితాబ్ మాత్రం ఈ విషయంలో స్పందించలేదు.