Begin typing your search above and press return to search.

'పుష్ప' సిగ్నేచ‌ర్ స్టెప్ తో అద‌ర‌గొట్టిన వార్న‌ర్

By:  Tupaki Desk   |   22 Jan 2022 3:47 AM GMT
పుష్ప సిగ్నేచ‌ర్ స్టెప్ తో అద‌ర‌గొట్టిన వార్న‌ర్
X
ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ ఇమ్మిటేష‌న్ డ్యాన్సింగ్ స్కిల్స్ గురించి తెలుగు అభిమానుల‌కు పరిచ‌యం చేయాల్సిన అవ‌స‌రం లేదు. అత‌డు ఇప్ప‌టికే ఎన్నో తెలుగు సినిమాల్లో డ్యాన్సులు పాట‌ల‌కు స్ఫూఫ్ వీడియోల‌తో అల‌రించాడు. ముఖ్యంగా బ‌న్నీని అనుకరించేందుకు ఎంతో ఇష్ట‌ప‌డ‌తాడు.

అల్లు అర్జున్ `పుష్ప: ది రైజ్`పైనా వార్న‌ర్ తన ప్రేమను చూపించాడు. ``త‌గ్గేదే లే`` డైలాగ్ ని రీక్రియేట్ చేస్తూ ఏస్ క్రికెటర్ హిట్ సినిమా నుండి డ్యాన్స్ స్టెప్ తో అల‌రించాడు. అతను సినిమాలోని అత్యంత ప్రజాదరణ పొందిన శ్రీవల్లి పాటకు డ్యాన్స్ చేసి ఇన్ స్టాగ్రామ్ లో ఆ వీడియోను పోస్ట్ చేశాడు. డేవిడ్ వార్నర్ సిగ్నేచర్ స్టెప్ ని సులభంగా రీక్రియేట్ చేశాడు. ఈ వీడియోకి వార్న‌ర్ అభిమానుల‌తో పాటు అల్లు అర్జున్ అభిమానుల నుండి కూడా అద్భుతమైన స్పందన వస్తోంది. ఇది అత్యంత వేగంగా వైరల్ గా మారింది.

వార్న‌ర్ ఆస‌క్తుల‌ను ఇష్ట‌ప‌డుతూ అద్భుతమైన నృత్య నైపుణ్యాలను ప్ర‌పంచ‌వ్యాప్తంగా ప్ర‌జానీకం ఇష్టపడుతున్నారు. మునుముందు అత‌డు ఇంకా ఇలాంటి మ్యాజిక‌ల్ వీడియోల‌తో సోష‌ల్ మీడియాల్లో అద్భుత‌ ఫాలోయింగ్ ని పెంచుకుంటాడ‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు. చూస్తుంటే సుక్కూ పుష్ప 2లో వార్న‌ర్ కోసం ఒక పాత్ర‌నే క్రియేట్ చేసేట్టున్నాడు!