Begin typing your search above and press return to search.

దిల్లీ డాక్ట‌ర్ గారి కూతురు వేడెక్కించే భంగిమ‌

By:  Tupaki Desk   |   26 Jun 2021 11:30 AM GMT
దిల్లీ డాక్ట‌ర్ గారి కూతురు వేడెక్కించే భంగిమ‌
X
దిల్లీ డాక్ట‌ర్ గారి కుమార్తె సౌంద‌ర్య శ‌ర్మ యాక్ట‌ర్ అయ్యింది మొద‌లు అగ్గిరాజేసే ఫోటోషూట్ విన్యాసాల‌తో నిరంత‌రం మీడియా హెడ్ లైన్స్ లో నానుతున్న సంగ‌తి తెలిసిందే. ముఖ్యంగా సోష‌ల్ మీడియాల్లో సౌంద‌ర్య ఫోటోషూట్ల వెల్లువ యూత్ లో భారీ ఫాలోయింగ్ తెస్తోంది. ఇక డాక్ట‌ర్ కుమార్తె అయినా కానీ న‌ట‌నా రంగంపై త‌న‌కు ఎంత పెద్ద క్ర‌ష్ ఉందో త‌న ప్యాష‌న్ చెప్ప‌క‌నే చెబుతోంది.

సౌంద‌ర్య శ‌ర్మ ఇప్ప‌టికే బాలీవుడ్ తో పాటు హాలీవుడ్ లోనూ పాపుల‌రైంది. ఇటీవ‌ల రిలీజైన బ్లాక్ బ‌స్ట‌ర్ హాలీవుడ్ మూవీ `వండ‌ర్ ఉమెన్` సీక్వెల్లో న‌టించి అంద‌రి దృష్టిని త‌న‌వైపు తిప్పేసుకుంది అంటే త‌న ట్ర‌య‌ల్స్ ఏ రేంజులో ఉంటాయో అర్థం చేసుకోవ‌చ్చు. ఇక తాజాగా ట్రెండింగ్ లో ఉన్న వెబ్ సిరీస్ ల‌పైనా ఈ అమ్మ‌డి క‌న్ను ప‌డింది. ఇటీవ‌ల ర‌క్తంచ‌ల్ సిరీస్ లో న‌టించి మంచి పేరు తెచ్చుకుంది.

కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే.. ప్ర‌స్తుతం రెండు వెబ్ షోల షూటింగ్ లు చేస్తోంది. మ‌హ‌మ్మారీ సెకండ్ వేవ్ అనంత‌రం ఇవి తిరిగి ప్రారంభ‌మ‌య్యాయి. రక్తంచల్ రెండవ సీజన్లో 80 శాతం షూటింగ్ పూర్తి చేసింది. తాను న‌టించిన ఓ సినిమా రిలీజ్ కి రావాల్సి ఉండ‌గా.. వేరొక చిత్రానికి ఇటీవ‌ల సంత‌కం చేసింద‌ట‌.

తాజాగా సౌంద‌ర్య శ‌ర్మ హాట్ ఫోటోషూట్ అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారింది. బ్లాక్ టాప్ .. బ్లూ డెనిమ్ నిక్క‌రులో సౌంద‌ర్య చిద్విలాసంగా ఫోజులిచ్చింది. బ్లూ డెనిమ్ కి 50 ప‌ర్సంట్ లోదుస్తుల క‌ల‌రింగ్ ఇవ్వ‌డం మ‌రో హైలైట్ అనుకుంటే... సౌంద‌ర్య అలా స్వేచ్ఛ‌గా హాటెస్ట్ భంగిమ‌లో క‌నిపించ‌డం మ‌రింత హీట్ పెంచేస్తోంది. ప్ర‌స్తుతం ఈ ఫోటో వెబ్ లో సునామీలా మారింది. డాక్ట‌ర్ గారి కూతురి డేర్ డెవిల్ స్టంట్స్
కిరాక్ పుట్టిస్తున్నాయంటూ కితాబిచ్చేస్తోంది యువ‌త‌రం.