Begin typing your search above and press return to search.

స్టార్ హీరో అలా చేశాడ‌ని సోష‌ల్ మీడియాని వ‌దిలేసిన బ్యూటీ!

By:  Tupaki Desk   |   26 April 2021 5:34 AM GMT
స్టార్ హీరో అలా చేశాడ‌ని సోష‌ల్ మీడియాని వ‌దిలేసిన బ్యూటీ!
X
వారినా హుస్సేన్.. ఇటీవ‌ల గూగుల్ లో ఎక్కువ‌గా ట్రెండ్ అయిన పేరు ఇది. ఆర్.ఆర్.ఆర్ న‌టుడు యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ స‌ర‌స‌న త‌దుప‌రి చిత్రంలో వారినా న‌టిస్తోంది! అంటూ ప్ర‌చార‌మైంది. ద‌ర్శ‌కుడు త్రివిక్ర‌మ్ ఏరికోరి త‌న‌నేఎంపిక చేసుకున్నార‌ని ప్ర‌చార‌మైంది. అయితే ఆ ప్రాజెక్ట్ మిడిల్ డ్రాప్ అయిన సంగ‌తి తెలిసిందే. తార‌క్ తో త్రివిక్ర‌మ్ ప్రాజెక్ట్ కి ఇంకా స‌మ‌యం ప‌డుతుంది. ఆ క్ర‌మంలోనే వారినాకు గ్రేట్ ఛాన్స్ మిస్స‌య్యింది. ప్ర‌స్తుతం కొర‌టాల‌తో ఎన్టీఆర్ ప‌ని చేస్తున్నారు.

ఈ బ్యూటీ మ‌రో ఆస‌క్తిక‌ర కార‌ణంతో మ‌రోసారి హెడ్ లైన్స్ లోకి వ‌చ్చింది. వారినా హుస్సేన్ సోషల్ మీడియాను విడిచిపెట్టింది.తాజాగా తన ఇన్ స్టాగ్రామ్ లో `శాంతి అవుట్` అని ఒక నోట్ రాశారు.

``ఇది విమానాశ్రయం కానందున మ‌న‌ నిష్క్రమణను ప్రకటించాల్సిన అవసరం లేదని ఎక్కడో చదివినట్లు నాకు గుర్తుంది. కానీ నా స్నేహితులు అభిమానుల కోసం నేను అలా చేస్తాను. వారి ప్రేమ ఎప్పుడూ నాకు బలం. ఇది నా చివరి సోషల్ మీడియా పోస్ట్.. కానీ నా బృందం నా ఖాతాను నిర్వహించడం కొనసాగిస్తుంది. కాబట్టి మీరు నా సినిమాల‌ గురించి తాజాగా తెలుసుకోవచ్చు`` అని తెలిపింది.

మార్చిలో తన పుట్టినరోజు అనంత‌రం తాను వర్చువల్ ప్రపంచం నుండి వైదొలగుతున్నాన‌ని ప్ర‌క‌టించిన‌ అమీర్ ఖాన్ ను అనుస‌రిస్తున్న‌ట్టు వారీనా వెల్ల‌డించ‌డం ఆస‌క్తిక‌రం. అయినా అమీర్ వైదొలిగాడ‌ని వారీనా సోష‌ల్ మీడియాని వ‌దిలేసిందా లేక ఇదంతా ప‌బ్లిసిటీ స్టంటా? అంటూ కొంద‌రు సందేహం వ్య‌క్తం చేస్తున్నారు.