Begin typing your search above and press return to search.

చెక్ నైజాం హక్కులు దక్కించుకున్న వరంగల్ శ్రీను.. రేట్ ఎంతంటే?

By:  Tupaki Desk   |   11 Feb 2021 9:36 PM IST
చెక్ నైజాం హక్కులు దక్కించుకున్న వరంగల్ శ్రీను.. రేట్ ఎంతంటే?
X
యువహీరో నితిన్ గతేడాది భీష్మా సినిమా విజయంతో ఫుల్ స్వింగ్ లోకి వచ్చినట్లే అనిపిస్తుంది. ఎందుకంటే ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇప్పటికే చెక్ సినిమాతో పాటు రంగ్ దే, పవర్ పేట, సినిమాలను లైన్ లో పెట్టేసాడు. ఫిబ్రవరి 26న చెక్ మూవీ విడుదల కాబోతుంది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీరిలీజ్ బిజినెస్ పనులు జరుగుతున్నాయి. క్రియేటివ్ డైరెక్టర్ చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా విడుదలకు సిద్ధం అవుతోంది. ఫస్ట్ నుండి డిఫరెంట్ సినిమాలతో అలరిస్తున్న డైరెక్టర్ చంద్రశేఖర్ ఏలేటి ఈసారి కూడా చెక్ మూవీతో వెరైటీ కాన్సెప్ట్ ఏదో తెరమీదకి తెస్తున్నట్లు తాజాగా విడుదల చేసిన చెక్ ట్రైలర్ చూస్తే అర్ధమవుతుంది. ఆద్యంతం ఆసక్తి రేపుతున్న చెక్ టీజర్, ట్రైలర్ లలో హీరో నితిన్ జైలులో ఖైదీగా పరిచయం అయ్యాడు.

జైల్లో ఖైదీగా ఉన్న హీరో చెస్ ఆటలో ఆరితేరిన వాడని.. ఒక ఖైదీ చెస్ అద్భుతంగా ఆడుతున్నాడు. అంటే విశ్వనాధ్ ఆనంద్ లా అంటూ మాటలతో ఆసక్తి రేకేత్తించారు మేకర్స్. నేరస్థులను ఉరి వేయడానికి తీసుకెళ్తుండగా అందులో హీరో ఉండటం.. తీవ్రవాది, టెర్రరిస్ట్, దేశద్రోహి ఇదే నీ గుర్తింపు అంటూ హీరో పై పోలీస్ అరవడం.. ఆ వెంటనే 'అతను ఇన్నోసెంట్' అని హీరోయిన్ ఫుల్ బజ్ క్రియేట్ చేసింది. భవ్య క్రియేషన్స్ బ్యానర్ లో వి. ఆనంద్ ప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా ప్రకాష్ వారియర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమా నైజాం హక్కులను వరంగల్ శ్రీను 5.40 కోట్లకు దక్కించుకున్నాడు. ఆంధ్ర ఏరియా 7 కోట్ల రేషియోలో క్లోజ్ చేసినట్లు బోగట్టా. సీడెడ్ హక్కులను కెఎఫ్ సి సంస్థ సొంతం చేసుకుంది. ఇప్పటికే డిజిటల్ శాటిలైట్ హక్కులను జెమిని కొనుగోలు చేసిందట. ఇక కేవలం హిందీ డబ్బింగ్ మాత్రమే క్లోజ్ చేయాల్సి ఉందని సమాచారం.