Begin typing your search above and press return to search.

ప్ర‌పంచ యుద్ధం 12 నిమిషాలేనా?!

By:  Tupaki Desk   |   18 Oct 2015 7:23 AM GMT
ప్ర‌పంచ యుద్ధం 12 నిమిషాలేనా?!
X
క్రిష్ తన కంచెని రెండో ప్ర‌పంచ యుద్ధం నేప‌థ్యంలో తీశాడు. నిజానికి అదో పెద్ద కాన్వాస్‌. అందులో ఎంతైనా హీరోయిజాన్ని చూపించొచ్చు, ఇంకెంతైనా డ్రామాని పండించొచ్చు. కంచెలో కూడా వ్యూహాలు, ప్ర‌తివ్యూహాలతో కూడిన యుద్ధం స‌న్నివేశాలు బ‌లంగా ఉంటాయ‌నే ఊహించారంతా. ట్ర‌యిల‌ర్ లో కూడా వార్ సీక్వెన్స్‌ నే ప్ర‌ముఖంగా చూపిస్తున్నారు మ‌రి.

ఆ నేప‌థ్యంలో నిజంగానే మంచి డ్రామాని పండించొచ్చని చాలా సినిమాలు నిరూపించాయి. ఇటీవ‌ల ప్రేక్ష‌కుల ముందుకొచ్చిన బాహుబ‌లిలో కూడా రాజ‌మౌళి అదే చేశాడు. ఏకంగా 40 నిమిషాల వార్ ఎపిసోడ్ చూపించి అల‌రించాడు. అయితే రెండో వ‌రల్డ్ వార్ నేప‌థ్యాన్ని తీసుకొన్నా స‌రే క్రిష్ మాత్రం మా సినిమాలో యుద్ధానికి సంబంధించిన స‌న్నివేశాలు కేవ‌లం 12 నిమిషాలే ఉంటాయ‌ని చెబుతున్నాడు. అంటే అంత పెద్ద కాన్వాస్‌ లో ఉన్న వార్ సీక్వెన్స్‌ ని కేవ‌లం 12 నిమిషాల్లో ముగించేశాడ‌న్న‌మాట‌. అయితే ఆ ప్ర‌భావం మాత్రం సినిమా మొత్తంగా క‌నిపిస్తుంటుంద‌ని చెబుతున్నాడు. మిగ‌తా స‌న్నివేశాల‌న్నీ ప్రేమ‌, ఊరు నేప‌థ్యంలోనే సాగుతాయ‌ట‌.

క్రిష్ తాను చెప్పాల‌నుకొన్న ఊరు నేప‌థ్యంలో సాగే ఓ ప్రేమ‌క‌థ‌కి రెండో ప్ర‌పంచ యుద్ధాన్ని నేప‌థ్యంగా ఎంచుకొన్నాడ‌న్న‌మాట‌. ఓ సీక్వెన్స్‌ ని మాత్రం బ‌లంగా, వాస్త‌వానికి అద్దం ప‌ట్టేలా ఉండాల‌న్న‌ట్టుగా జార్జియాకి వెళ్లి అక్క‌డ నేచుర‌ల్‌ గా స‌న్నివేశాల్ని తీశారు. నిజానికి వ‌రుణ్‌ తేజ్‌ లాంటి చిన్న హీరోని పెట్టుకొని సినిమా మొత్తం యుద్ధం చూపించ‌డం కూడా సాహ‌స‌మే అవుతుంది. అందుకే క్రిష్ కూడా తెలివిగా యుద్ధం ఎఫెక్ట్‌ ని కాస్త చూపిస్తూ ఆ నేప‌థ్యాన్ని మాత్ర‌మే ఎక్కువ‌గా వాడుకొన్నాడని అర్థ‌మ‌వుతోంది. సినిమా విడుద‌ల‌కు ఇక నాలుగు రోజులే స‌మ‌యం ఉండ‌టంతో చిత్ర‌బృందం ప్ర‌మోష‌న్స్ కోసం ప‌రుగులు పెడుతోంది.