Begin typing your search above and press return to search.

బిబి4 : మగాడిలా ఆడు.. అభిజిత్‌ సోహెల్‌ ల మాటల యుద్దం

By:  Tupaki Desk   |   30 Sept 2020 11:00 AM IST
బిబి4 : మగాడిలా ఆడు.. అభిజిత్‌ సోహెల్‌ ల మాటల యుద్దం
X
మొన్నటి ఎపిసోడ్‌ లో ఎలిమినేషన్‌ నామినేషన్‌ పక్రియ జరిగింది. నిన్నటి ఎపిసోడ్‌ లో కొత్త కెప్టెన్‌ ఎంపిక పక్రియ జరిగింది. అంతకు ముందు మార్నింగ్‌ మస్తీలో భాగంగా సోహెల్‌ దొంగతనం గురించి మాట్లాడాలి. గోవాలో స్నేహితులతో కలిసి షాపింగ్‌ కు వెళ్లి దొంగతనం చేశాం అంటూ చెప్పుకొచ్చాడు. ఆ తర్వాత సోహెల్‌ మరియు అభిజిత్‌ లు మాట్లాడుకుంటూ మాటా మాటా పెరిగింది. మళ్లీ ఇద్దరి మద్య ఉక్కు హృదయం టాస్క్‌ గురించి వచ్చింది. ఆ సమయంలో నాగార్జున గారు మమ్ములను అభినందించారు అనడంతో సోహెల్‌ మమ్ములను కూడా మనుషుల మాదిరిగా ఎమోషన్స్‌ తో ఆడారు అన్నారు. బిగ్‌ బాస్‌ కూడా మమ్ములను అభినందించారు. నువ్వు అమ్మాయిల సాయంతో అమ్మాయిని అడ్డం పెట్టుకుని ఆడావు అంటూ అభిజిత్‌ పై సోహెల్‌ తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. మగాడిలా టాస్క్‌ ఆడు అంటూ సోహెల్‌ వ్యాఖ్యలు చేయడంతో మ్యాటర్‌ సీరియస్ అయ్యింది.

సోహెల్‌ వ్యాఖ్యలకు అభిజిత్‌ కూల్‌ గానే సమాధానం చెబుతూ వచ్చాడు. ఆయన నేను ఇంతే ఇలాగే ఉంటాను. సరే నువ్వు ఏం అనుకున్నా పర్వాలేదు అన్నట్లుగా వ్యాఖ్యలు చేశాడు. ఇద్దరి మద్య మాటల యుద్దం పెరుగుతున్న సమయంలో ఇంటి సభ్యులు వారిని కూల్‌ చేసి పక్కకు తీసుకు వెళ్లారు. ఆ తర్వాత కూడా సోహెల్‌ అభిజిత్‌ ను మాటలు అంటూనే ఉన్నాడు. వీరి గొడవ సర్ధుమనుగుతున్న సమయంలో బిగ్‌ బాస్‌ నుండి కెప్టెన్సీ టాస్క్‌ వచ్చింది. పై నుండి కాయిన్స్‌ పడుతూ ఉంటాయి. వాటిని పట్టుకోవాల్సి ఉంటుంది. టాస్క్‌ ముగిసే సమయానికి ఎవరి వద్ద ఎక్కువ కాయిన్స్‌ ఉంటాయో వారు కెప్టెన్సీ పోటీ దారుడు అవుతారు.

పై నుండి పడ్డ కాయిన్స్‌ ను ఒకరిని ఒకరు నెట్టుకుంటూ తీసుకున్నారు. ఒకరి నుండి మరొకరు ఆ కాయిన్స్‌ ను దొంగతనం చేశారు. దివి నుండి సోహెల్‌ దొంగతనం చేయగా.. కుమార్‌ సాయి కాయిన్స్‌ ను దివి దొంగతనం చేసింది. కుమార్‌ ఎంత అడిగినా కూడా ఆమె ఇవ్వనంటే ఇవ్వనంటూ తన టీ షర్ట్ లో పెట్టుకుంది. సోహెల్‌ ను దివి దొంగ అనడంతో అతడికి బాగా కోపం వచ్చింది. కూర్చుని మాట్లాడాల్సిందే అన్నాడు. నిన్నటి ఎపిసోడ్‌ లో కాయిన్‌ గేమ్‌ పూర్తి కాలేదు. నేటి ఎపిసోడ్‌ లోనూ అది కొనసాగబోతుంది. నేడు కెప్టెన్సీ పోటీ దారుడు ఎవరు అనే విషయమై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.