Begin typing your search above and press return to search.

టాలీవుడ్ కి మాస్ మసాలా డైరెక్టర్స్ కావలెను...!

By:  Tupaki Desk   |   14 May 2020 2:40 PM IST
టాలీవుడ్ కి మాస్ మసాలా డైరెక్టర్స్ కావలెను...!
X
సినీ ఇండస్ట్రీ లో కాలంతో పాటు ఎన్నో మార్పులు వస్తూ ఉన్నాయి. దీంతో పాటు ప్రేక్షకుల అభిరుచి కూడా మారుతూ వస్తోంది. ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టు సినిమాలను తీస్తూ వస్తున్నారు దర్శక నిర్మాతలు. ఒకప్పుడు దర్శకులు మాంచి మాస్ మసాలా సినిమాలు తీయడానికి ఉత్సాహం చూపించేవారు. టాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తం మాస్ డైరెక్టర్లతో నిండి ఉండేది. అప్పట్లో వచ్చిన సినిమాలు దాదాపుగా అన్నీ మాస్ సినిమాలే. హీరోలు కూడా మాస్ మసాలా సినిమాలలో నటించడానికే ఇంటరెస్ట్ చూపించేవారు. కానీ తర్వాత రోజుల్లో ఆడియన్స్ అభిరుచి మారుతూ వచ్చింది. క్లాస్ సినిమాలు ఎక్కువగా రావడం మొదలయింది. డైరెక్టర్లు కూడా అలాంటి వాటిని చూపించడానికే ఎక్కువగా ఆసక్తి చూపించారు. హీరోలు కూడా క్లాస్ సినిమాల బాట పట్టారు. కొత్త తరం దర్శకులు సినీ ఇండస్ట్రీకి చాలామంది పరిచయమయ్యారు. వీరు కమర్షియల్ సినిమాల అర్థాన్ని మార్చేశారు.

అయితే ఇప్పుడు ఇండస్ట్రీలో మాస్ మసాలా సినిమాలు తీసే దర్శకుల కొరత ఏర్పడింది. ఉన్న కొద్దిమంది దర్శకుల సినిమాకి కూడా గ్యారంటీ లేదు. ఒకటి అర తప్ప పెద్దగా వారికి హిట్స్ దొరకడం లేదు. ఎంతో చక్కగా కామెడీ ఎంటర్టైన్మెంట్ మరియు హీరోయిజం, మంచి పాటలు కుదిరితే తప్ప మాస్ మూవీస్ హిట్ అవడం లేదు. అలాంటి డైరెక్టర్లు కూడా చాలా తక్కువ మందే ఉన్నారు. బి. గోపాల్ - వీవీ వినాయక్ లాంటి డైరెక్టర్లు సినిమాలు తగ్గించేశారు. అవుట్ డేటెడ్ అనే ముద్ర వేసేసారు. ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న మాస్ డైరెక్టర్లుకి గురువు పూరీ జగన్నాథ్ అని చెప్పవచ్చు. అలాంటి పూరీకి కూడా సక్సెస్ రేషియో తగ్గి పోయింది. కంటిన్యూస్ గా హిట్స్ ఇవ్వలేకపొతున్నాడు. గతేడాది వచ్చిన 'ఇస్మార్ట్ శంకర్' సినిమాతో మాస్ మూవీ తీసి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. కానీ ఈ సక్సెస్ ని కంటిన్యూ చేస్తాడో లేదో చెప్పలేము.

ఆ తర్వాత మరో మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్. తనదైన శైలిలో మాస్ సినిమాలను తీసుకుంటూ వస్తున్నాడు. కానీ హరీష్ శంకర్ పరిస్థితి కూడా అలాంటిదే. ఇక ఈ లిస్ట్ లో ఉండే ఊర మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను. ఒకప్పుడు ఊర మాస్ సినిమాలతో ఊపేసిన బోయపాటి తర్వాత రోజుల్లో సక్సెస్ రేట్ తగ్గిపోయింది. భారీ పరాజయాన్ని మూటగట్టుకొని మాస్ సినిమాలంటే ఆలోచించే పరిస్థితి క్రియేట్ చేసాడు. ఇకపోతే టాలీవుడ్ లో ఉన్న మిగతా డైరెక్టర్లు కూడా సక్సెస్ రేట్ లో వెనుకబడిపోయి సైలెంట్ అయ్యారు. ఈ నేపథ్యంలో టాలీవుడ్ కి మాస్ మసాలా సినిమాలు తీసే డైరెక్టర్ల కొరత ఏర్పడింది. దీంతో టాలీవుడ్ కి కొత్త శైలిలో మాస్ సినిమాలను తీసే దర్శకుల అవసరం ఏర్పడింది. మరి రాబోయే రోజుల్లో అలాంటి సినిమాలు తీసే డైరెక్టర్స్ వస్తారేమో చూడాలి.