Begin typing your search above and press return to search.

క్రేజీ బ్యూటీ సెకండ్‌ హీరోయిన్ గా అవసరమా?

By:  Tupaki Desk   |   7 Sep 2021 8:31 AM GMT
క్రేజీ బ్యూటీ సెకండ్‌ హీరోయిన్ గా అవసరమా?
X
సినిమా ఇండస్ట్రీలో స్టార్ డమ్‌ దక్కించుకునేందుకు చాలా కష్టపడాల్సి ఉంటుంది. హీరోయిన్స్ కెరీర్‌ ఆరంభంలో చాలా ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. ప్రస్తుతం స్టార్స్ గా ఉన్న చాలా మంది హీరోయిన్స్‌ కెరీర్‌ ఆరంభంలో ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి పలు సందర్బాల్లో చెప్పుకొచ్చారు. కాని కొందరికి మాత్రం అదృష్టం కొద్ది మొదటి లేదా రెండవ సినిమాతోనే స్టార్‌ డమ్‌ దక్కుతుంది. ఉప్పెన సినిమాతో కృతి శెట్టికి మొదటి సినిమాతోనే స్టార్‌ డమ్ దక్కింది. తెలుగు లో ఆమె ప్రస్తుతం క్రేజీ బ్యూటీ. యంగ్‌ హీరోలకు ఆమె మోస్ట్‌ వాంటెడ్‌ గా మారిపోయింది. రెండు పదుల వయసు లేకున్నా కూడా కోటికి పైగా పారితోషికంను ఈమె దక్కించుకుంటుంది అనేది ఇండస్ట్రీ వర్గాల టాక్‌. కోటి అయినా పర్వాలేదు అంటూ పలువురు ఫిల్మ్‌ మేకర్స్ ఆమె కు అడ్వాన్స్ లు ఇచ్చేస్తున్నారట. ప్రస్తుతం తెలుగు తో పాటు ఇతర భాషల్లో కూడా ఈమె జోరు కొనసాగుతుంది అంటూ వార్తలు వస్తున్నాయి. తమిళంలో రెండు మూడు ఆఫర్లు ఈమె చెంతకు వచ్చాయట. తాజాగా తెలుగు లో ఈమె అల్లు అర్జున్‌ ఐకాన్‌ సినిమాలో ఆఫర్ దక్కించుకుంది అనే ప్రచారం జరుగుతోంది.

వేణు శ్రీరామ్ దర్శకత్వంలో రూపొందబోతున్న ఐకాన్ సినిమాలో ఇప్పటికే పూజా హెగ్డేను హీరోయిన్‌ గా ఎంపిక చేశారు అనే వార్తలు ఆ మద్య వచ్చాయి. ఐకాన్‌ కథానుసారంగా మరో హీరోయిన్‌ కూడా అవసరం ఉంటుందట. అందుకే ఆ పాత్రకు గాను కృతి శెట్టిని ఎంపిక చేశారు అనేది టాక్‌. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ఐకాన్‌ మరి కొన్ని రోజుల్లో పట్టాలెక్కించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. కనుక హీరోయిన్స్‌ విషయంలో తుది నిర్ణయం తీసుకునేందుకు చర్చలు జరుపుతున్నారట. పూజా హెగ్డే ఉన్న తర్వాత మరో హీరోయిన్‌ గా ఎవరు చేసినా కూడా పెద్దగా క్రేజ్ ఉండే అవకాశం లేదు. అంటే సెకండ్‌ హీరోయిన్ గా ప్రాముఖ్యత అంతంత మాత్రమే ఉంటుంది. అలాంటి అంతంత మాత్రం ప్రాముఖ్యత ఉన్న పాత్రను చేయాల్సిన అవసరం ఏంటీ అంటూ కృతి శెట్టిని కొందరు ప్రశ్నిస్తున్నారు. కృతి శెట్టి ప్రస్తుతం స్టార్‌ హీరోయిన్ గా దూసుకు పోతున్న క్రేజీ బ్యూటీ. అలాంటి కృతికి సెకండ్‌ హీరోయిన్‌ పాత్రలు అవసరం లేదు.

ఐకాన్‌ లో కాకుంటే ఆ తర్వాత ఎప్పుడైనా అల్లు అర్జున్ తో నటించే అవకాశం వస్తుంది. అప్పటి వరకు వెయిట్‌ చేయాలి కాని ఇప్పుడే అల్లు అర్జున్‌ తో సెకండ్‌ హీరోయిన్ గా నటించి తనకు తాను తన క్రేజ్ ను తగ్గించుకోవడం కరెక్ట్‌ కాదు అంటూ సోషల్‌ మీడియాలో కృతి శెట్టి అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. రామ్‌ తో లింగు స్వామి దర్శకత్వంలో ఒక సినిమాను చేస్తున్న కృతి శెట్టి ఇటీవలే బంగార్రాజు సినిమాలో చైతూకు జోడీగా ఎంపిక అయ్యింది. మరో రెండు మూడు ప్రాజెక్ట్‌ లు కూడా దాదాపుగా కన్ఫర్మ్‌ అయ్యాయి. ఇంత బిజీగా ఉన్న నువ్వు ఎందుకు సెకండ్‌ హీరోయిన్ గా చేయాలి అంటూ అభిమానులు ప్రశ్నించడం ఖాయం. కనుక కృతి శెట్టి ఐకాన్‌ లో సెకండ్‌ హీరోయిన్‌ గా చేయాలనే ఆలోచన ఉంటే మానుకోవడం మంచిది అంటూ సినీ విశ్లేషకులు కూడా సూచిస్తున్నారు. అసలు విషయం ఏంటీ అనేది చూడాలి. అసలు ఐకాన్ లో ఆమె ను సంప్రదించారా అనేది కూడా తెలియాల్సి ఉంది.