Begin typing your search above and press return to search.

స‌మ్మ‌ర్ వేడి త‌గ్గాలంటే బికినీ బీచ్ లో కాక్ టైల్ కావాల‌ట‌!

By:  Tupaki Desk   |   25 March 2021 7:30 AM GMT
స‌మ్మ‌ర్ వేడి త‌గ్గాలంటే బికినీ బీచ్ లో కాక్ టైల్ కావాల‌ట‌!
X
వేస‌వి తాపం అంత‌కంత‌కు పెరుగుతోంది. మార్చి నుంచి ఏప్రిల్ కి అట్నుంచి మే -జూలై వ‌ర‌కూ సూర్య‌తాపం పీక్స్ కి చేరుకుంటుంది. అయితే ఈ తాపం నుంచి బ‌య‌ట‌పడేందుకు కొందరు భామ‌లు చేస్తున్న ప్ర‌య‌త్నం ఇండ‌స్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.

ఇంత‌కీ ఆదిపురుష్ 3డి లో సీత‌గా న‌టిస్తున్న అందాల కృతి స‌నోన్ ఈ స‌మ్మ‌ర్ తాపం నుంచి ఎలా బ‌య‌ట‌ప‌డ‌నుంది? అంటే ఇదిగో ఇదే ప్రాక్టిక‌ల్ స‌మాధానం. నిరంత‌రం త‌న దేహ‌శిరుల్ని వెట్ గా ఉంచేందుకు ఇష్ట‌ప‌డుతుంద‌ట‌. ఇలా త‌డిసిన శిరోజాల్ని ఆర‌బెడుతూ తాను ఏం చేయ‌ద‌లిచిందో అభిమానుల‌కు చెప్పేసింది.

``ఇదిగో స‌మ్మ‌ర్ ఇక్క‌డుంది.. బీచ్ లు.. కాక్ టైల్ పార్టీలు కావాలి!`` అంటూ ఒక్క‌సారిగా అగ్గి రాజేసింది కృతి. నిజ‌మే ఈ వేస‌వి పేరుతో మాల్దీవులు స‌హా ఒంట‌రి దీవుల‌న్నీ సెలబ్రిటీల‌తోనే కిట‌కిట‌లాడిపోతుంటాయి. లాక్ డౌన్ ముగిసి అన్ లాక్ ప్ర‌క్రియ మొద‌ల‌య్యాక‌ మరింత కిట‌కిట పెరిగింది. ఆదిపురుష్ స‌హా ప‌లు బాలీవుడ్ చిత్రాల‌తో కృతి బిజీగా ఉంది.